అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం తర్వాత ఢిల్లీకి చేరిన ప్రధాని నరేంద్ర మోదీ మరో కొత్త ప్రథకాన్ని ప్రకటించారు. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన (Pradhanmantri Suryodaya Yojana) ద్వారా కోటి ఇళ్లపై సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రపంచంలోని భక్తులంతా ఎల్లప్పుడూ సూర్యవంశీయుడైన శ్రీరాముడి నుంచి కాంతిని, శక్తిని పొందుతారు.

ఈ రోజు అయోధ్యలో పవిత్ర ప్రతిష్ఠాపన శుభ సందర్భంగా, భారతదేశంలోని ప్రజల ఇళ్లపై సొంత సౌర వ్యవస్థ కలిగి ఉండాలన్న తీర్మానం మరింత బలపడింది’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ చర్య ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు కరెంటు బిల్లులు తగ్గడమే కాకుండా ఇంధన రంగంలో భారతదేశాన్ని స్వావలంబనగా మారుస్తుందని వెల్లడించారు.

Here's PM Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)