Malkangiri/Bijapur, April 24: ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. సబ్ ఇన్‌స్పెక్టర్ మురళి తాతీని కాల్చి (ASI Murali Tati Murdered By Maoists) చంపారు. అనంతరం ఆయన మృతదేహాన్ని పుల్సుమ్‌పారా (Palnar in Bijapur) వద్ద పడేసి వెళ్లారు. ఈ నెల 21న చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలనార్ గ్రామంలో ఏఎస్సై తాటి మురళిని (Police ASI Murali Tati) మావోయిస్టులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. మూడు రోజులపాటు తమ చెరలో ఉంచుకున్న మావోలు తాజాగా మురళిని హత్యచేసి పుల్సుమ్ పారా వద్ద రోడ్డుపై పడేశారు.
ఈ నెల మొదటి వారంలో పోలీసులకు, మావోలకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో మురళి ప్రమేయం ఎక్కువగా ఉందని ( After Abduction In Chhattisgarh) ఆరోపిస్తూ కిడ్నాప్ చేశారు. చత్తీస్‌గఢ్‌లోని పలు గ్రామాల్లో అమాయక ఆదివాసీ గిరిజనులను హత్య చేయడంతోపాటు మహిళలపై అత్యాచారానికి తెగబడ్డాడని ఆరోపించారు. ఈ విషయమై పలుమార్లు హెచ్చరికలు కూడా జారీ చేసినట్టు పేర్కొన్నారు.
అయినప్పటికీ తీరు మార్చుకోకపోవడంతో ప్రజా కోర్టు పెట్టి చంపేశామని పేర్కొన్నారు. కాగా, మురళిని విడిపించేందుకు మధ్యవర్తులు ప్రయత్నిస్తున్న సమయంలోనే మావోయిస్టులు ( Maoists) ఈ ఘాతుకానికి పాల్పడడం గమనార్హం. మృతదేహం వద్ద బస్తర్ కమిటీ పేరుతో మావోయిస్టుల లేఖ లభ్యమైంది. మురళి హత్యను ఇంకా పోలీసులు ధ్రువీకరించలేదు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.