Deoria (Uttar Pradesh), January 10: ఈ మధ్య పోలీసులు మరీ రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. అధికారం చేతిలో ఉంది కదా అని కొంతమంది ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. యూపీలోని పోలీసులు ఓ వ్యక్తిని చిత్రహింసలకు గురి చేశారు. మొబైల్‌ను దొంగిలించాడనే నెపంతో (Mobile Theft) ఓ వ్యక్తిని పోలీసులు చితకబాదారు.
ఈ ఘటన యూపీలోని డియోరియా పోలీసు స్టేషన్‌లో (Deoria Police Station)గురువారం చోటు చేసుకుంది. మహేన్ గ్రామానికి చెందిన సుమిత్ గోస్వామిని మొబైల్ దొంగతనం చేశాడనే అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గోస్వామిని స్టేషన్‌కు తీసుకువచ్చిన పోలీసులు.. అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ముగ్గురు పోలీసులు కలిసి తమ బూట్ల కాళ్లతో అతన్ని తన్నారు. బెల్ట్‌తో చితకబాదారు.
Here's the ANI tweet And Video
Deoria: In a video, three police personnel can be seen thrashing a man, accused of stealing a mobile phone, at a police station. SP Shripati Mishra says, "The three cops have been suspended. FIR is being registered against them. The man has been sent for medical exam." (09.01) pic.twitter.com/SDDhNGMcip
— ANI UP (@ANINewsUP) January 9, 2020
This is the @deoriapolice , viciously assaulting a young man accused of mobile theft by his neighbour , inside a police station. One cop tries to smash the man's face with his boot , the man is hit multiple times with a belt as other cops pin him down . Three cops suspended ... pic.twitter.com/hzDplXrDv0
— Alok Pandey (@alok_pandey) January 10, 2020
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ వీడియో పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి రావటంతో వెంటనే స్పందించారు. గోస్వామిని చితకబాదిన ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి పూర్తి స్థాయి విచారణ జరపాలని పోలీస్ అధికారి శ్రీపతి మిశ్రా (Shripati Mishra) ఆదేశించారు.
చంద్రమౌలేశ్వర్ సింగ్, లాల్ బిహారీ, జితేంద్ర యాదవ్ అనే ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. వారిపై ఎఫ్ఐఆర్ నమో చేశారు. అలాగే బాధితున్ని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.