New Delhi, June 02: మోదీ సర్కారు మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు విప్లవాత్మక బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్రం...తాజాగా జనాభా నియంత్రణ (Population Control) కోసం చట్టం తీసుకురాబోతోంది. ఈ మేరకు స్వయంగా కేంద్రమంత్రి ప్రహ్లాద్ పటేల్ (Prahlad Patel) స్ఫష్టత ఇచ్చారు. ఛత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగిన గరీబ్ కల్యాణ్ సమ్మేళన్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా జనాభా నియంత్రణ చట్టం గురించి స్పందించారు. త్వరలోనే జనాభా నియంత్రణకు సంబంధించిన చట్టం రాబోతుందని, ఈ విషయంలో ఆందోళన అవసరం లేదని ఆయన చెప్పారు.

జనాభా నియంత్రణ బిల్లు గురించి ఎప్పట్నుంచో చర్చ జరుగుతోంది. ఇప్పటికే 2019లో జనాభా నియంత్రణ కోసం ఉద్దేశించిన ముసాయిదా బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత కొంతకాలానికి శివసేన ఎంపీ అనిల్ దేశాయ్ కూడా ఇద్దరు పిల్లల విధానాన్ని ప్రతిపాదిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లును 2020లో రాజ్యసభలో ప్రవేశపెట్టారు.

NEET PG Result 2022 Declared: నీట్ పీజీ ఫలితాలు విడుదల, ఈ కింద ఇచ్చిన లింక్ ద్వారా రిజల్ట్ చెక్ చేసుకోండి 

ప్రస్తుతం ఈ బిల్లులు రాజ్యసభ పరిశీలనలోనే ఉన్నాయి. అయితే, తాజాగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ సింగ్ చేసిన వ్యాఖ్యలతో జనాభా నియంత్రణ చట్టాన్ని కేంద్రం ప్రవేశపెట్టబోతున్నట్లు స్పష్టమైంది.