
మహారాష్ట్రలోని పుణెలో పోర్షే కారు నడిపి (Pune Porsche Crash) ఇద్దరి మరణానికి కారణమైన మైనర్ బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్‌ను (Vishal Agarwal) పోలీసులు అరెస్టు చేశారు. జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద నమోదైన కేసు ఆధారంగా ప్రముఖ బిల్డర్ అయిన అగర్వాల్ ని ఔరంగాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో ప్రముఖ వ్యాపారి కుమారుడు రాష్ డ్రైవింగ్, బైక్‌లపై వెళ్తున్న ఇద్దరు యువకులు మృతి, వీడియో ఇదిగో..
ఆదివారం తెల్లవాజామున కొరెగావ్ పార్క్‌లో విశాల్ అగర్వాల్ కొడుకు 17 ఏండ్ల మైనర్ బాలుడు మద్యం మైకంలో పోర్షే కారుతో ఓ బైకును ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి విశాల్ అగర్వాల్ పరారీలో ఉన్నాడు. దీంతో పోలీసులు ఆయనను మంగళవారం ఉదయం ఛత్రపతి శంభాజీనగర్ సమీపంలో అరెస్టు చేశారు. ప్రమాదం సమయంలో మైనర్ బాలుడు 200 కిలోమీటర్ల వేగంతో కారును నడిపి బైక్‌ను ఢీకొట్టినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు నిర్ధారణకు వచ్చారు.