New Delhi, June 21: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం (జూన్ 21)న జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిరోజు ప్రాణాయామం చేయడం ద్వారా శ్వాసను నియంత్రించడాన్ని మెరుగుపరుస్తుంది. ఆ రకంగా కోవిడ్ -19 తో పోరాడటానికి అవసరమైన రోగనిరోధక శక్తిని పెంచడానికి 'ప్రాణాయామం' సహాయపడుతుందని అన్నారు.
"కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఈ ఏడాది అందరూ ఇంట్లోనే ఉండి యోగాను చేయాల్సి వస్తుంది. మనమందరం కుటుంబంతో కలిసి ఇంట్లోనే యోగా చేస్తున్నాం. యోగా ప్రజలను ఏకం చేస్తుంది, ప్రపంచాన్ని ఏకం చేస్తుంది. ఈ మహమ్మారికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో యోగా మనకు సహాయం చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో మరియు శ్వాసకోశ అనారోగ్యాలను నివారించడంలో ప్రాణాయామాలు మనకు ఎంతగానో సహాయపడతాయి" అని పీఎం మోదీ అన్నారు.
Here's what PM Modi said:
Yoga enhances our quest for a healthier planet.
It has emerged as a force for unity and deepens the bonds of humanity.
It does not discriminate.
It goes beyond race, colour, gender, faith and nations.
Anybody can embrace Yoga: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 21, 2020
యోగా అనేది ఒక ఆరోగ్యకరమైన ప్రపంచం కోసం వ్యక్తి యొక్క తపనను పెంచుతుంది. ఇది ఇతరుల పట్ల సంఘీభావం మరియు సోదరభావం పెంపొందించే ఒక శక్తిగా అవతరించింది, మానవ సంబంధాలను మరింత ధృడం చేస్తుంది. యోగాకు జాతి, రంగు, లింగం, అనే బేధాలు ఉండవు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా యావత్ ప్రపంచం ఇప్పుడు యోగా యొక్క ఆవశ్యకతను గ్రహించింది.
రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉంటే, అది వ్యాధిపై సమర్థవంతంగా పోరాడటానికి సహాయపడుతుంది. యోగాలో మన రోగనిరోధక శక్తిని పెంచే, శ్వాస సంబంధ ఇబ్బందులు తొలగించే మరియు జీవక్రియను మెరుగుపరిచే ఎన్నో ఆసనాలు ఉన్నాయి. ఈ కోవిడ్ మహమ్మారి సమయంలో యోగా మనకు చాలా సహాయపడుతుంది ”అని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు.
యోగాను అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించాలని ప్రతిపాదించిన కొన్ని నెలల తర్వాత, 2014 డిసెంబర్ 11న ఐక్యరాజ్యసమితి తన సర్వసభ్య సమావేశంలో జూన్ 21ను 'అంతర్జాతీయ యోగా దినోత్సవం' గా ప్రకటించింది. అప్పట్నించి భారత్ యోగా దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తూ వస్తుంది.