Former President Pranab Mukherjee | File Image | (Photo Credits: PTI)

New Delhi, August 17: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి ( Pranab Mukherjee Health Update) విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని ఆర్మీ ఆస్పత్రి అధికారులు సోమవారం వెల్లడించారు. ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య నిపుణుల బృందం నిశితంగా పరిశీలించిందని పేర్కొన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ (Condition Remains Critical) ప్రణబ్‌ శరీరం వైద్యం అందించడానికి సహకరిస్తూ స్థిరంగా ఉందని తెలిపారు.

ఢిల్లీ కంటోన్మెంట్‌ ప్రాంతంలోని ఆర్మీ ఆసుపత్రిలో ప్రణబ్‌ (Pranab Mukherjee) ఈ నెల 10వ తేదీన చేరిన విషయం తెలిసిందే. మెదడులో ఏర్పడ్డ ఒక అడ్డంకిని తొలగించేందుకు ఆయనకు శస్త్ర చికిత్స కూడా జరిగింది. అదే రోజు ఆయనకు కోవిడ్‌–19 పరీక్షలు జరపగా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే.

నాన్న చికిత్స‌కు స‌హ‌క‌రిస్తున్నార‌ని ప్ర‌ణ‌బ్ కుమారుడు అభిజిత్ ముఖ‌ర్జీ నిన్న ట్వీట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ మేరకు ట్వీట్ చేసిన అభిజిత్.. చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు. ‘నాన్న చికిత్స పొందుతున్న హాస్పిటల్‌కు శనివారం వెళ్లి ఆయనను చూశాను.. ‘దేవుడి దయ, అందరి ప్రార్ధనలతో పరిస్థితి మెరుగుపడింది.. ఇంతకు ముందుకంటే స్థిరంగా ఉన్నారు.. చికిత్సకు ప్రతిస్పందిస్తున్నారు! త్వరలోనే మన మధ్య తిరిగి వస్తాడని మేము గట్టిగా నమ్ముతున్నాం. ధన్యవాదాలు’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌‌ మీద ప్రణబ్‌ ముఖర్జీ, మెదడులో ఒకచోట రక్తం గడ్డకట్టడంతో ఆపరేషన్‌, ఇప్పటికే కరోనాతో బాధపడుతున్న మాజీ రాష్ట్రపతి

క్లిష్టమైన వైద్య పరిభాషలో కాకుండా, నాకు అర్థమైనదేమంటే గత రెండురోజులుగా మా నాన్నగారి ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగానే ఉన్నప్పటికీ.. అది మరింత దిగజారలేదు. వెలుతురుకు ఆయన కళ్లు కొద్దిగా ప్రతిస్పందిస్తున్నాయి.’అని మూడు రోజుల కిందట శర్మిష్ఠా ట్వీట్ చేశారు.