Jan Suraaj party: మాజీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడి పాత్రలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. బిహార్‌లో ఆయన ప్రారంభించిన జన్‌సురాజ్ అభియాన్ సంస్థ గాంధీజయంతి సందర్భంగా అక్టోబర్ 2న రాజకీయ పార్టీగా మారనుంది. రాజకీయ పార్టీగా మారేముందు ప్రశాంత్‌కిశోర్ పెద్దఎత్తున కసరత్తు చేయనున్నారు. దీనికి జన్‌సురాజ్ రాజకీయ పార్టీగా నామకరణం చేయనున్నారు.
జన్ సురాజ్ రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌లో ఆదివారం ఆయన ప్రసంగిస్తూ వచ్చే ఏడాది జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు.అక్టోబర్ 2న గాంధీ జయంతి నాడు తమ పార్టీని ప్రారంభిస్తామని మాజీ వ్యూహాకర్త ప్రకటించారు. బీహార్ ముఖచిత్రాన్ని మార్చడమే తమ పార్టీ ధ్యేయమని అన్నారు.రెండేళ్ల క్రితం జన్ సురాజ్ ప్రచారాన్ని ప్రారంభించామని, గతంలో చెప్పిన విధంగానే దీనిని రాజకీయ పార్టీగా మారుస్తున్నట్టు ఆయన తెలిపారు. ఆర్మీ అంటే 140 కోట్ల భారతీయుల నమ్మకం, అగ్నిపథ్ స్కీంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు, ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడిన భారత ప్రధాని
అక్టోబర్ 2కు ముందు జన్‌సురాజ్ సంస్థ తమ నేతలతో ఎనిమిది రాష్ట్రస్థాయి సమావేశాలు నిర్వహించనుంది. ప్రశాంత్‌కిశోర్ పాదయాత్ర కోసం పనిచేసిన లక్షన్నర మంది కార్యకర్తలతో రాష్ట్రవ్యాప్త సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాలన్నింటిలో పార్టీ సంస్థాగత నిర్మాణం ఎలా ఉండాలి.. విధి విధానాలు ఏంటి..పార్టీ ప్రాధాన్యాలేంటన్న విషయాలపై చర్చించి ఫైనల్ చేయనున్నారు.
కాగా జన్‌సురాజ్ పేరు మీద బిహార్‌లో ప్రశాంత్‌కిశోర్ సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నిర్వహించిన సభల్లో విద్య, వైద్యం, యువతకు ఉద్యోగ అవకాశాలపైనే ఎక్కువ ఫోకస్ చేసి ప్రసంగించారు. కాగా, ఇటీవల తమ కార్యకర్తలెవరూ జన్‌సురాజ్‌తో సంబంధాలు నెరపొద్దని బిహార్ ప్రతిపక్షపార్టీ ఆర్జేడీ ఒక అంతర్గత సర్కులర్ జారీ చేసింది. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ బిహార్‌లో అత్యంత బలమైన పార్టీ అని చెప్పుకునే ఆర్జేడీ తమను చూసి భయపడుతోందని జన్‌సురాజ్‌ఎద్దేవా చేసింది. భారత సైన్యం కార్గిల్ యుద్ధంలో పాక్ సైన్యాన్ని తరిమికొట్టిన రోజు, కార్గిల్ విజయ్ దివస్ చరిత్ర ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిందే,
కాగా బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ మనవరాలు జాగృతి ఠాకూర్ పార్టీలో చేరడాన్ని ప్రశాంత్ కిషోర్ స్వాగతించారు. అలాగే ఆర్జేడీ మాజీ ఎమ్మెల్సీ రామ్‌బలి సింగ్ చంద్రవంశీ, మాజీ ఐపీఎస్ అధికారి ఆనంద్ మిశ్రా తదితరులు పార్టీలో చేరారు. కాగా, కోటి మంది తన పార్టీలో చేరుతారని ప్రశాంత్ కిశోర్ ఇటీవల ప్రకటించారు.