Image used for representational purpose only | (Photo Credits: ANI)

Bareilly, Sep 22: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఓ గర్భిణిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి (Pregnant woman gang-raped) పాల్పడ్డారు. ప్రాణాలతో బయటపడిన బాధితురాలని జిల్లా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.సెప్టెంబరు 13న మజ్‌గవాన్ గ్రామంలోని బిషారత్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొంత పని నిమిత్తం పొలానికి వెళ్లిన 3 నెలల గర్భిణిపై నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత వారు అక్కడి నుంచి పారిపోయారు.

ఇంతలో, మహిళ చాలా సేపటికి ఇంటికి చేరుకోకపోవడంతో, ఆమె కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతకగా పొదల్లో అపస్మారక స్థితిలో ఆమె కనిపించింది. దీంతో ఆమెను ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా, ఆ మహిళకు గర్భస్రావం (suffers miscarriage in Bareilly) అయిందని వైద్యులు తెలిపారు.తమకు న్యాయం చేయాలంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు ప్లాస్టిక్‌ డబ్బాలో పిండంతో ఎస్‌ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు.

ఓ వైపు రక్తం కారుతూ, మరో వైపు నొప్పితో ఏడుస్తున్నా వదలని కామాంధులు, మైనర్ బాలికను దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి బట్టలు లేకుండా ఇంటికి పంపించిన కిరాతకులు

నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్పీ దేహత్ రాజ్‌కుమార్ అగర్వాల్ విచారణకు ఆదేశించారు. మహిళ వాంగ్మూలం తీసుకున్నామని, నిజానిజాలు రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.