President Droupadi Murmu (photo-ANI)

New Delhi, june 27:  లోక్‌సభ సమావేశాలు నాలుగోరోజు ప్రారంభమయ్యాయి. 18వ లోక్‌సభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) తొలిసారి ప్రసంగించారు. ఇటీవలే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొంది ఎంపీలుగా ప్రమాణస్వీకరాం చేసిన సభ్యులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ ప్రజల విశ్వాసాన్ని గెలిచి సభకు ఎన్నికయ్యారని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయరని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో సభ్యులు విజయవంతమవుతారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

‘మన దేశ ఎన్నికలు ప్రపంచంలోనే అతిపెద్దవి. సార్వత్రిక ఎన్నికలు విజయవంతంగా నిర్వహించినందుకు ఈసీకి అభినందనలు. సభ్యులంతా దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తారని ఆశిస్తున్నాను. ప్రపంచమంతా భారత ఎన్నికలను నిశితంగా పరిశీలించింది. ప్రజలు ప్రభుత్వాన్ని విశ్వసించి మళ్లీ పట్టం కట్టారు. ప్రభుత్వ సుస్థిరత, నిజాయితీని నమ్మారు.

Here's Videos

ఈ ఎన్నికల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రిఫార్మ్‌, పర్‌ఫార్మ్‌, ట్రాన్స్‌ఫార్మ్‌ ఆధారంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. పదేళ్ల పాలనలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం అయ్యింది. పెట్టుబడులు, ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం. త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదుగుతుంది. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తోంది’ అని రాష్ట్రపతి తన ప్రసంగంలో వివరించారు.  అధికారులు బెల్ట్ తీసుకోవడంతో నా ఫ్యాంట్ పదే పదే జారిపోతోంది, కోర్టుకు విన్నవించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కోర్టు ఏమన్నదంటే..

ఇటీవల నీట్‌, నెట్‌ వంటి ప్రవేశ పరీక్షల్లో వెలుగుచూసిన అక్రమాలను రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘‘ప్రభుత్వం చేపట్టే నియామకాలు, పరీక్షల్లో పవిత్రత ఉండాలి. పారదర్శకంగా జరగాలి. పేపర్‌ లీక్‌లు, పరీక్షల్లో అక్రమాలకు సంబంధించిన కేసుల్లో ఉన్నతస్థాయిలో విచారణ జరుగుతోంది. ఇలాంటి ఘటనల్లో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన అవసరముంది. నీట్‌, తదితర పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం. పేపర్‌ లీకేజీ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని ముర్ము తెలిపారు.

జమ్మూకశ్మీర్‌పై శత్రువులు అంతర్జాతీయ వేదికలపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. కానీ, ఈ ఎన్నికల్లో కశ్మీర్‌ లోయలో మార్పు కనిపించిందని పేర్కొన్నారు. శత్రువుల కుట్రలకు అక్కడి ప్రజలు గట్టిగా బదులిచ్చారన్నారు. అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనడం విశేషం అన్నారు.

‘రిఫార్మ్‌, పర్‌ఫార్మ్‌, ట్రాన్స్‌ఫార్మ్‌ (సంస్కరణలు, పనితీరు, మార్పు) ఆధారంగా ప్రజలు ఎన్నికల్లో తీర్పు ఇచ్చారు. గత పదేళ్ల పాలనలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైంది. పెట్టుబడులు, ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం. త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదుగుతుంది. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తోంది. పెద్ద ఎత్తున మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చింది.

మహిళల ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయి. మహిళల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టాం. పౌరవిమానాయాన రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చాం. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. ఆర్థిక భరోసా కోసం నేరుగా రైతుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా మెట్రో సేవలు విస్తరించాం’ అని ముర్ము తన ప్రసంగంలో వివరించారు.