New Delhi, October 02 : మహాత్మా గాంధీగా (Mahatma Gandhi) పేరుగాంచిన మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని ముందుండి నడిపించి భారతదేశానికి స్వాతంత్య్రాన్ని అందించడంలో కీలకభూమిక పోషించారు. రాజకీయాలకు అతీతంగా, దేశంలోని అన్ని రాజకీయ పార్టీల శ్రేణులచే గౌరవింపబడే అదికొద్ది మంది రాజకీయ నాయకులలో గాంధీజీ ఒకరు. ప్రపంచానికే శాంతి మార్గాన్ని చూపిన మన జాతిపిత గాంధీజీ పుట్టినరోజైన అక్టోబర్ 02 ను ప్రతీ ఏడాది ఒక జాతీయ పండుగగా 'గాంధీ జయంతి' (Gandhi Jayanti) గా జరుపుకుంటున్నాము.
నేడు గాంధీజీ 151వ జయంతి (151st Birth Anniversary) సందర్భంగా, దేశం యావత్తు ఆ మహత్ముడి సేవలను మరోసారి స్మరించుకుంటూ ఆయనకు ఘనమైన నివాళిని అర్పిస్తుంది.
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ (Ramnath Kovind), ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) మరియు ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు ఢిల్లీలోని 'రాజ్ ఘాట్' కు చేరుకొని ఆయన సమాధి వద్ద అంజలి ఘటించారు.
'గాధేయ మార్గమైన సత్యం మరియు అహింస ఆదర్శాలను ప్రజలందరూ పాటించాలని రాష్ట్రపతి అన్నారు. స్వచ్ఛమైన, సంపన్నమైన భారతదేశం కోసం దేశ పౌరులు తమవంతు కృషి చేయాలని రామ్ నాథ్ కోరారు.
సమాజంలో సమానత్వాన్ని మరియు సామరస్యాన్ని తీసుకురావడం ద్వారా గాంధీజీ యొక్క ఆదర్శాలు ప్రపంచ సంక్షేమానికి మార్గం సుగమం చేస్తుందని రామ్ నాథ్ కోవింద్ అభిలాషించారు.
Prez Ramnath Kovind's tweet
गांधी जयंती के दिन, कृतज्ञ राष्ट्र की ओर से राष्ट्रपिता महात्मा गांधी को श्रद्धा-सुमन अर्पित करता हूं। सत्य, अहिंसा और प्रेम का उनका संदेश समाज में समरसता और सौहार्द का संचार करके समस्त विश्व के कल्याण का मार्ग प्रशस्त करता है। वे संपूर्ण मानवता के प्रेरणा-स्रोत बने हुए हैं।
— President of India (@rashtrapatibhvn) October 2, 2020
PM Modi's Tweet:
గాంధీ జయంతి సందర్భంగా ప్రియమైన బాపుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము. ఆయన జీవితం, బాపూజీ ఉన్నతమైన ఆలోచనల నుండి నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. సంపన్నమైన మరియు ప్రేమగల భారతదేశాన్ని సృష్టించడంలో బాపు యొక్క ఆదర్శాలు మనకు మార్గదిర్ధేశం చేస్తాయి' అని పీఎం మోదీ అన్నారు.
We bow to beloved Bapu on Gandhi Jayanti.
There is much to learn from his life and noble thoughts.
May Bapu’s ideals keep guiding us in creating a prosperous and compassionate India. pic.twitter.com/wCe4DkU9aI
— Narendra Modi (@narendramodi) October 2, 2020
ఈరోజు గాంధీ జయంతితో పాటు భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా కావడంతో నేతలందరూ శాస్త్రికి కూడా ఘనమైన నివాళులు అర్పించి, ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.