PIB Press Note: ఎల్‌పిజి డిస్ట్రిబూటర్ షిప్ లు, రిటైల్ అవుట్‌లెట్ డీలర్ షిప్ లను ఇవ్వడానికి, డబ్బు ను డిమాండు చేస్తున్న కొంత మంది వ్యక్తులు/ బోగస్ సంస్థలు అనేక నకిలీ వెబ్‌సైట్ లను సృష్టించాయన్న సంగతి చమురు మార్కెటింగ్ కంపెనీల (ఒఎంసి స్) దృష్టి కి వచ్చింది. అమాయకులైన దరఖాస్తుదారులను మోసగించడం కోసం ఈ నకిలీ వెబ్‌సైట్ రూపు రేఖలను సిసలు వెబ్‌సైట్ లు అయిన www.lpgvitarakchayan.in మరియు www.petrolpumpdealerchayan.in ల మాదిరిగానే తయారు చేస్తున్నారని ఒఎంసి లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియమ్ కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియమ్ కార్పొరేషన్ లిమిటెడ్ లు ఒక ప్రకటన లో తెలిపాయి.
ఈ నకిలీ వెబ్‌సైట్ ల నుంచి అమాయకులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు పంపినట్టు బూటకపు ఇ-మెయిల్స్ ను పంపించడం జరుగుతోంది. ఒఎంసి గుర్తింపు చిహ్నాలను ఉపయోగించుకొంటూ ఇ-మెయిల్స్ ను పంపించడం, ఒఎంసి ల పేరుతో భారీ మొత్తం లో నగదును వసూలు చేయడం జరుగుతోంది.ఈ కారణంగా ప్రజానీకాన్ని కేవలం ఒఎంసి ల యొక్క ఆధికారిక వెబ్‌సైట్ లు అయినటువంటి www.lpgvitarakchayan.in ను (ఎల్‌పిజి డిస్ట్రిబ్యూటర్ షిప్ ల కోసం) ఇంకా, www.petrolpumpdealerchayan.in (రిటైల్ అవుట్‌లెట్ డీలర్ షిప్ ల కోసం) లను సందర్శించవలసింది గాను, నీతి నియమాలు లేని, అన్యాయానికి వెనుకాడని శక్తుల వలలో చిక్కుకొని మోసపోకుండా జాగ్రత్త పడవలసిందిగాను ప్రకటన లో సూచించడమైంది.
ఎల్‌పిజి డిస్ట్రిబ్యూటర్ షిప్ లేదా రిటైల్ అవుట్‌లెట్ డీలర్‌షిప్ ఇస్తామంటూ ఏదైనా వర్తమానం అందినట్లయితే సంబంధిత వ్యక్తులు తక్షణం సమీపం లోని నిజమైన సంబంధిత చమురు కంపెనీ కార్యాలయాన్ని సంప్రదించాలని మనవి చేయడమైంది. అంతేకాకుండా, ఇటువంటి సందర్భం ఏదైనా ప్రజల దృష్టికి వచ్చినప్పుడు ప్రజానీకం సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని కూడా స్పష్టం చేయడమైంది.
దేశవ్యాప్తంగా ఎల్‌పిజి పంపిణీదారు సంస్థలు మరియు రిటైల్ అవుట్‌లెట్ డీలర్ల నియామకానికి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ఒక సువ్యవస్థితమైన ఎంపిక ప్రక్రియను అనుసరిస్తున్నాయని ప్రకటనలో వెల్లడించారు. దీనిలో భాగం గా అన్ని వివరాలతో ఒక ప్రకటనను ప్రముఖ వార్తా పత్రికలలో వెలువరించడం, ఆ ప్రకటన ను ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీల వెబ్‌సైట్ లో సైతం ప్రదర్శించడం, అలాగే అర్హులైన అభ్యర్ధుల ను లాటరీ తీయడం వంటివి చేపడుతారు.
ప్రభుత్వ రంగ ఒఎంసి ల ఆధికారిక వెబ్‌సైట్ లు ఈ కింది విధంగా ఉన్నాయి
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ -- www.iocl.com
భారత్ పెట్రోలియమ్ కార్పొరేషన్ లిమిటెడ్ --- www.bharatpetroleum.com
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ -- www.hindustanpetroleum.com
ప్రభుత‌్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఏవీ కూడా దేశంలో ఎల్‌పిజి పంపిణీదారులు మరియు రిలైల్ అవుట్‌లెట్ డీలర్ల ఎంపిక/భర్తీ కోసం వాటి పక్షాన ఎటువంటి సంస్థను గానీ లేదా వ్యక్తిని గానీ నియమించడం గానీ లేదా ఎంపిక ప్రక్రియ లో ఏ దశ లో అయినా ఏ అభ్యర్ధి నుంచి అయినా ఎటువంటి ధనాన్ని కోరేందుకు ఏ సంస్థ కు, లేదా వ్యక్తి కి అయినా అధికారాన్ని ఇవ్వడం గానీ జరుగలేదని స్పష్టం చేయడమైంది.
ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలకు ప్రాతినిధ్యం వహించే ఆశయంతో ఏ వ్యక్తి కి గాని, లేదా వ్యక్తుల సమూహానికి/సంస్థలకు/కంపెనీలకు గాని చెల్లించిన సొమ్ముకు ఒఎంసి లు ఏ రకంగాను బాధ్యత వహించవు అని పేర్కొనడమైంది. ఆన్ లైన్ లో ఆ తరహా వెబ్‌సైట్ ల నకిలీ ఇ- మెయిల్స్ కు స్పందించే వారు ఆ క్రమం లో వెల్లడి చేసే కీలకమైన వ్యక్తిగత సమాచారాన్ని వారికి ఆర్థికంగా గాని, లేదా ఇతర రూపాలలో గాని నష్టం కలిగించే విధంగా అవతలి పక్షం దుర్వినియోగ పరచేందుకు ఆస్కారం ఉన్నదన్న సంగతిని కూడా దృష్టిలో పెట్టుకోవాలని ప్రజానీకానికి ఒఎంసి లు ఈ సందర్భంగా హెచ్చరిక చేయడమైంది.