File Image of Nitin Gadkari | Photo Credits: IANS

New Delhi, May 7: దేశవ్యాప్తంగా ప్రజా రవాణాపై కొద్ది రోజుల్లోనే కీలక నిర్ణయం వెల్లడిస్తామని కేంద్ర రవాణాశాఖా మంత్రి నితిన్ గడ్కరీ (Union Minister Nitin Gadkari) బుధవారం ప్రకటించారు. కరోనా వైరస్‌ కట్టడికి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అమలుతో రోడ్డెక్కని బస్సులు కొద్దిపాటి నియంత్రణలతో ప్రజా రవాణాను అనుమతిస్తామని (Public transport may open soon) రహదారులు, హైవే మంత్రిత్వ శాఖలను పర్యవేక్షిస్తోన్న గడ్కరీ పేర్కొన్నారు. మోస్ట్ వాంటెడ్ ఉగ్ర‌వాది రియాజ్ నాయ్‌కూ హతం, ఉగ్ర‌వాదిని ప‌ట్టిస్తే రూ.12 ల‌క్ష‌లు ఇస్తామని ఇది వరకే ప్రకటించిన ప్రభుత్వం, 33 ఏళ్ల వ‌య‌స్సులో తుపాకి పట్టిన రియాజ్

కొన్ని కీలక మార్గదర్శకాలతో కూడిన ప్రకటనను (Lockdown Guidelines on Public Transport) త్వరలో విడుదల చేస్తామని ఆయన తెలిపారు. దేశంలోని బస్సు, కార్ల ఆపరేటర్లతో ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

నిర్ధిష్ట మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజా రవాణా తిరిగి ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజా రవాణాను పున: ప్రారంభించడం ద్వారా ప్రజల్లో తిరిగి ఉత్సాహం వస్తుందని, త్వరలోనే కొన్ని మార్గదర్శకాలతో ప్రజా రవాణాకు అనుమతినిస్తామని ఆయన ప్రకటించారు. అయితే బస్సులను, కార్లను నడిపే సమయంలో మాత్రం మాస్కులు ధరించడం, శానిటైజర్స్ వాడటం, సామాజిక దూరం పాటించడం లాంటి నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనని గడ్కరీ స్పష్టం చేశారు. అయితే ప్రజా రవాణాను ఎప్పటి నుంచి అనుమతిస్తారనేది మంత్రి వెల్లడించలేదు.

Interaction of Nitin Gadkari with Transporters:

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మేరకు మే 17 వరకూ లాక్‌డౌన్‌ (Lockdown 3.0) కొనసాగుతుంది. కాగా గ్రీన్‌జోన్లలో ప్రభుత్వం ఇప్పటికే పలు సడలింపులను ప్రకటించన సంగతి తెలిసిందే. కోవిడ్‌-19తో కుదేలైన ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం కల్పించేందుకు కృషిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లతో తాను సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి గడ్కరీ పేర్కొన్నారు