Riyaaz Naikoo Death: మోస్ట్ వాంటెడ్ ఉగ్ర‌వాది రియాజ్ నాయ్‌కూ హతం, ఉగ్ర‌వాదిని ప‌ట్టిస్తే రూ.12 ల‌క్ష‌లు ఇస్తామని ఇది వరకే ప్రకటించిన ప్రభుత్వం, 33 ఏళ్ల వ‌య‌స్సులో తుపాకి పట్టిన రియాజ్
Encounter | Representational Image | (Photo Credits: IANS)

Pulwama, May 6: మోస్ట్ వాంటెడ్ హిజ్బుల్ ముజాహిదీన్ క‌మాండ‌ర్ రియాజ్ నాయ్‌కూ (Top Hizbul terrorist Riyaz Naikoo) ఎన్‌కౌంట‌ర్‌లో మృతి చెందాడు. జ‌మ్మూక‌శ్మీర్‌లోని భ‌ద్ర‌తా ద‌ళాలు (Jammu & Kashmir Police) మోస్ట్ వాంటెడ్ ఉగ్ర‌వాది రియాజ్ నైకూను హ‌త‌మార్చాయి. పుల్వామా జిల్లాలోని (Pulwama) అవంతిపురాలో రాత్రి నుంచి భ‌ద్ర‌తా ద‌ళాలు కూంబింగ్ ఆప‌రేష‌న్ చేప‌ట్టాయి. కాల్పులుకు తెగబడిన ఉగ్రవాదులు, ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఆర్టికల్ 370 రద్దు తర్వాత మళ్లీ కాల్పుల కలకలం, ఉగ్రవాదుల కోసం గాలింపు ముమ్మరం

అయితే బేగ్‌పుర గ్రామంలో ఉగ్ర‌వాది రియాజ్ ఉన్న‌ట్లు గుర్తించారు. గ‌త రాత్రి నుంచి జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ఉగ్ర‌వాది రియాజ్ భ‌ద్ర‌తా బ‌ల‌గాల కాల్పుల్లో మృతిచెందాడు. నిన్న రాత్రి నుంచి జ‌రిగిన కార్డెన్ స‌ర్చ్ ఈ రోజు మ‌ధ్యాహ్నం వ‌ర‌కు ముగిసింది.

హిజ్‌బుల్ ముజాయిద్దీన్ క‌మాండ‌ర్ అయిన రియాజ్ త‌ల‌పై 12 ల‌క్ష‌ల రివార్డు కూడా ఉన్న‌ది. మ‌రో ఎదురుకాల్పుల్లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల‌ను హ‌త‌మార్చిన‌ట్లు ఆర్మీ చెప్పింది. పాంపోర్ జిల్లాలోని శార్‌షాలి గ్రామంలో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ఆ ఉగ్ర‌వాదులు మ‌ర‌ణించారు. రియాజ్ నైకూ కోసం గ‌త 8 ఏళ్ల నుంచి క‌శ్మీర్‌లోని భ‌ధ్ర‌తా ద‌ళాలు ఎదురుచూస్తున్నాయి. 2016లో క‌శ్మీర్‌లో మిలిటెంట్ నేత బుర్హ‌న్ వానీ హ‌త‌మైన త‌ర్వాత నైకూ ఉగ్ర‌నేత‌గా ఎదిగాడు. భారీ దాడులకు ప్లాన్ చేసిన ఉగ్రవాదులు

క‌శ్మీర్‌లో స్థానిక పోలీసుల్ని చంప‌డంలో రియాజ్ మాస్ట‌ర్‌మైండ్‌గా ఎదిగాడు. దీంతో ద‌క్షిణ క‌శ్మీర్ జిల్లాల్లో పోలీసులు ఒంట‌రిగా తిరిగేవారు కాదు. ఉగ్ర‌వాద గ్రూపులో చేర‌క‌ముందు నైకూ స్థానిక స్కూల్‌లో లెక్క‌ల టీచ‌ర్‌గా చేశాడు. గులాబీ పువ్వుల పెయింటింగ్ వేయ‌డంలో ఇత‌ను దిట్ట‌. 33 ఏళ్ల వ‌య‌సులో రియాజ్‌.. ఉగ్ర‌వాదం వైపు మ‌ళ్లాడు. శ్రీనగర్‌లో ఉగ్రవాదుల గ్రెనేడ్ దాడి

2016 జులై 8న అనంత‌నాగ్ జిల్లాలోని కోర్నాగ్ ప్రాంతంలో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు జ‌రిపిన కాల్పుల్లో హిస్బుల్ క‌మాండ‌ర్ బుర్హాన్ మ‌ర‌ణించిన అనంత‌రం, సీనియ‌ర్ స‌భ్యుడైన రియాజ్ క‌మాండ‌ర్ బాధ్య‌త‌లు స్వీరించాడు. ఉగ్ర‌వాద గ్రూపుల్లో చేర‌కు ముందు రియాజ్ గ‌ణిత ఉపాధ్యాయుడిగా ప‌నిచేశాడు. చిత్ర‌కారుడిగా గులాబీపూలు గీసేందుకు ఇష్ట‌ప‌డే అత‌డు. 33 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులో తుపాకి ప‌ట్టాడు.