Mephedrone Seized: ఢిల్లీ, పుణెలో భారీ ఆపరేషన్, రూ.2,500 కోట్ల విలువైన మెఫెడ్రోన్‌ పట్టుకున్న అధికారులు, దాదాపు 1,100 కిలోల నిషేధిత డ్రగ్‌ సీజ్
Mephedrone (photo-X/Video Grab)

పూణే, 20 ఫిబ్రవరి 2024: పూణే సిటీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ నగరంలో మెఫెడ్రోన్ స్మగ్లింగ్ రింగ్‌పై (Mephedrone Smuggling) దర్యాప్తు ప్రారంభించింది. విశ్రాంత్‌వాడి ప్రాంతం నుండి 55 కిలోల ఎండిని స్వాధీనం చేసుకున్న తరువాత, కుర్కుంబ్‌లోని 'ఎర్త్‌కెమ్ లేబొరేటరీస్' ఫ్యాక్టరీ నుండి అదనంగా 600 కిలోల ఎండిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న MD అంచనా విలువ 1,440 కోట్లకు చేరుకుంది.

మొత్తంగా దేశ రాజధాని ఢిల్లీ, పుణెలో నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో దాదాపు 1,100 కిలోల నిషేధిత డ్రగ్‌ మెఫెడ్రోన్‌(MD)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా మ్యావ్‌ మ్యావ్‌ అని పిలువబడే దీని విలువ రూ. 2,500 కోట్లు (1,100kg worth Rs 2,200cr Seized) ఉంటుందని పోలీసులు గుర్తించారు. ఈ స్మగ్లింగ్ ఆపరేషన్‌లో కీలక పాత్రధారులైన సామ్, బ్రా అనే ప్రధాన సహాయకుల కోసం దర్యాప్తు బృందాలను ఢిల్లీ, ముంబైలకు పంపారు.ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.

హైదరాబాద్‌లో డ్రగ్స్ దందాపై సంచలన విషయాలు, డ్రగ్స్‌ ఇంటర్నేషనల్‌ పెడ్లర్‌ టోనీ నుండి కీలక విషయాలు తెలుసుకున్న పోలీసులు, దర్యాప్తు ముమ్మరం

పోలీసుల వివరాల ప్రకారం.. పుణెలో ముగ్గురు డ్రగ్స్ స్మగ్లర్లను అరెస్టు చేయడంతో పాటు 700 కిలోల మెఫెడ్రోన్‌ను స్వాధీనం చేసుకోవడంతో ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. నిందితుల విచారణ అనంతరం ఢిల్లీలోని హౌజ్ ఖాస్ ప్రాంతంలో దాడులు నిర్వ‌హించి 400 కిలోల సింథటిక్ ఉద్దీపనను స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా పుణెలోని కుర్‌కుంభ‌ ఎమ్‌ఐడీసీ ప్రాంతంలో ని ఓ ఫార్మాస్యూటిక‌ల్ ప్లాంట్‌లో 700 కిలోల డ్ర‌గ్‌ను సీజ్‌ చేశారు.

Here's Video

కాగా మహారాష్ట్రలో ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్‌ పట్టుబడటం ఇదే తొలిసారి. అంతేగాక దేశంలోనే అత్యంత ముఖ్యమైన డ్రగ్స్ బస్ట్‌లలో ఒకటి. ఈ ఘటనపై పుణె పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ మాట్లాడుతూ.. ఈ ఆపరేషన్‌కు సంబంధించి ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా.. వీరిలో ముగ్గురు కొరియర్‌ బాయ్స్‌తోపాటు మరో ఇద్దరు ప్రస్తుతం విచారణలో ఉన్నట్లు తెలిపారు.

ఫార్మా ప్లాంట్‌ ఓనర్‌ను అరెస్టు చేశామ‌ని, భీంజీ అలియాస్‌ అనిల్‌ పరశురాం, కెమికల్‌ ఇంజినీర్‌ యువరాజ్‌ బబన్‌ భుజ్‌భాయ్‌కు దీంతో సంబంధం ఉంద‌ని పేర్కొన్నారు. పుణె బృందం ఢిల్లీ వెళ్లి స్థానిక పోలీసుల సాయంతో అక్కడ దాడులు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ రాకెట్‌లో కొందరు విదేశీయులు, విదేశాల్లోని భారతీయుల హస్తం కూడా ఉన్నట్లు తాము గుర్తించామని చెప్పారు. డగ్స్‌ను ప్యాక్‌ చేయడానికి నిందితులు ఉప్పు గోదాములను వినియోగించినట్లు పేర్కొన్నారు. ఇక‌ మెఫెడ్రిన్‌ తయారీ, విక్రయంపై పూర్తిస్థాయిలో నిషేధం ఉంది. దీనిని ఉల్లంఘిస్తే ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కేసులు నమోదు చేయవచ్చు.

ఈ ఘటనపై అదనపు పోలీస్ కమిషనర్‌ శైలేష్‌ బాల్కవాడే మాట్లాడుతూ.. ఈ రాకెట్‌లో కొందరు విదేశీయులు, విదేశాల్లోని భారతీయుల హస్తం కూడా ఉన్నట్లు తాము గుర్తించామని పోలీస్‌ కమిషనర్‌ చెప్పారు. డగ్స్‌ను ప్యాక్‌ చేయడానికి నిందితులు ఉప్పు గోదాములను వినియోగించినట్లు పేర్కొన్నారు. ఫార్మా కంపెనీ యజమాని, ఈ డ్రగ్‌ మాఫియా మాస్టర్‌మైండ్‌ మధ్య సంబంధాలు ఎలా మొదలయ్యాయో గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మెఫెడ్రిన్‌ (MD drug) తయారీ, విక్రయంపై పూర్తిస్థాయిలో నిషేధం ఉంది. దీనిని ఉల్లంఘిస్తే ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కేసులు నమోదు చేయవచ్చు. ప్రస్తుతం స్వాధీనం చేసుకొన్న మాదక ద్రవ్యాన్ని కుర్‌కుంభ నుంచి ఢిల్లీలోని స్టోరేజీ పాయింట్లకు తరలించి భద్రపరుస్తున్నారు. ఈ నేరానికి సంబంధించిన దర్యాప్తును పోలీసు కమిషనర్ అమితేష్ కుమార్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ ప్రవీణ్ పవార్ మార్గనిర్దేశంలో పని చేస్తూ, దర్యాప్తు ప్రయత్నాలలో అదనపు కమిషనర్ (క్రైమ్) శైలేష్ బాల్కవాడే, క్రైమ్ బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్ అమోల్ జెండే మరియు అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ సునీల్ తాంబే, సతీష్ గోవేకర్ ఉన్నారు. క్రైం బ్రాంచ్‌లోని అన్ని బృందాలు వారి నేతృత్వంలో సమగ్ర దర్యాప్తును ముమ్మరంగా నిర్వహిస్తున్నాయి.