Punjab: Blast Kills 14-15 People in Tarn Taran, 20 Injured |Image used for representative purpose. (Photo Credits: IANS)

Chandigarh, February 9: పంజాబ్‌లో (Punjab)శనివారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కులో తీసుకెళుతున్న బాణాసంచా ప్రమాదావశాత్తు పేలడంతో (Punjab Blast) 15 మంది మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్ఎస్‌పీ Dhruv Dahiya స్పందించారు. అంత పెద్ద మొత్తంలో బాణాసంచాను ఎక్కడికి తరలిస్తున్నారు? అనుమతులు ఉన్నాయా లేదా ఆరా తీస్తున్నారు.  కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఈ ఘటన ఏ విధంగా జరిగిందన్న విషయంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. టార్న్ తరణ్ (Tarn Taran Explosion) వద్ద మధ్యాహ్నం ఘటన చోటు చేసుకుంది. ఘటన స్థలం నుంచి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలిస్తున్నారు. బాణా సంచా తరలిస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడటంతో ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

CM Capt.Amarinder Singh Tweet

మృతులంతా పంజాబ్ వాసులేనని తెలుస్తోంది. ఘటన జరిగినప్పుడు ఎక్కువ మంది ట్రాలీలో ఉండటం, బాణా సంచా పేలుడు తీవ్ర కూడా అధికమొత్తంలో ఉండటంతో పేలుడు ధాటికి 15 మంది ఒక్కసారిగా అక్కడికక్కడే మృతి చెందారు.

పంజాబ్‌లో ఘోర ప్రమాదం, కుప్పకూలిన మూడంతస్తుల భవనం

గాయపడ్డ వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ఘటనపై పూర్తి దర్యాప్తు జరుపుతున్నట్లు పంజాబ్ పోలీసులు చెబుతున్నారు. నిజంగా బాణా సంచా, లేదా ఏదైనా పేలుడు పదార్థాలు తీసుకెళ్తున్నారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Here's ANI Tweet

ఈ విషాద ఘటనపై ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ (CM Amarinder Singh) స్పందించారు. చనిపోయిన వారికి తన సంతాపాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు పంజాబ్ ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఓ) రూ .5 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది. "ఈ రోజు తార్న్ తరణ్ లోని నాగర్ కీర్తన్ సందర్భంగా ట్రాలీలో బాణసంచా పేలుడుపై మెజిస్టీరియల్ దర్యాప్తుకు సిఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆదేశించారు. మరణించిన వారి బంధువులకు 5 లక్షల రూపాయల ఎక్స్-గ్రేటియా గ్రాంట్ మరియు గాయపడినవారికి ఉచిత చికిత్సను ప్రకటించారు" అని పంజాబ్ సిఎంఓ ఓ ప్రకటన విడుదల చేసింది.