Chandigarh, March 12: పంజాబ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న భగవంత్ మాన్ (Bhagwant Mann) కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రాజ్ భవన్ లో కాకుండా భగత్ సింగ్ (Bhagat Singh) గ్రామమైన ఖట్కర్ కలన్ లో సీఎంగా ప్రమాణం చేస్తానని ప్రకటించి అందరి దృష్టిని మరోసారి ఆకర్షించారు. అంతేగాకుండా కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫొటోలు ఉండవని, షహీద్ భగత్ సింగ్, బాబా సాహెబ్ అంబేద్కర్ ఫొటోలు ఉంటాయని వెల్లడించారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూతో (Navjot singh siddu) పాటూ 122 మంది మాజీ ఎమ్మెల్యేలకు భద్రత తొలగించారు. రజియా సుల్తానా, పర్గత్ సింగ్, ధరంబీర్ అగ్ని హోత్రి, తర్లోచన్, అరుణ్ నారంగ్, రాణా గుర్జీత్ సింగ్, మన్ ప్రీత్ సింగ్ బాదల్, భరత్ భూషణ్ అషు, నాథూ రామ్, దర్శన్ లాల్ లతో పాటు ఇతరుల భద్రతను వెనక్కి పిలిచారు. అయితే.. భగవంత్ మాన్ వేణు ప్రసాద్ ను ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించినట్లు సమాచారం.
Police stations are lying vacant. We will take only police work from police force. I think the security of the people of Punjab is more important than the security of few people: Punjab CM-designate Bhagwant Mann on reports of removing security of former ministers & MLAs pic.twitter.com/upWen0a8Va
— ANI (@ANI) March 12, 2022
మాజీల భద్రత కారణంగా పోలీస్ స్టేషన్లు ఖాళీగా ఉంటున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పోలీసులతో కేవలం భద్రతకు సంబంధించిన పనులు మాత్రమే చేయిస్తామని, మాజీ భద్రత కంటే....ప్రజల భద్రతే తమకు ముఖ్యమన్నారు భగవంత్ మాన్.
ఇప్పటికే మొహలీలో ఆప్ (AAP) ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భగవంత్ మాన్ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతినివ్వాలని కోరుతూ ఆయన గవర్నర్ ను కోరారు. ఖట్కర్ కలాన్ లో ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్‌లో ఆప్ ఏకంగా 92 సీట్లలో విజయం సాధించింది. చీపురు దెబ్బకు కాంగ్రెస్, బీజేపీతో సహా ఇతర పార్టీలు కొట్టుకపోయాయి. ఎన్నికల ప్రచారం సమయంలోనే ఆప్ సీఎం అభ్యర్ధిగా భగవంత్ మాన్ ను ప్రకటించారు కేజ్రీవాల్.