IRCTC: ఆ రైళ్లలో ప్రయాణించే వారికి గుడ్ న్యూస్, ముందస్తుగా టీ, కాఫీ బుక్‌చేసుకోని ప్రయాణికులకు సేవా పన్ను ఎత్తివేసిన ఇండియన్ రైల్వే, ఇకపై కేవలం రూ.20 మాత్రమే చెల్లిస్తే చాలు
Passengers at platform | (Photo Credits: Getty Images)

New Delhi, July 19: ప్రీమియం రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు రైల్వేశాఖ (IRCTC) స్వల్ప ఊరట కల్పించింది. ఈ రైళ్లలో ముందస్తుగా టీ, కాఫీ బుక్‌చేసుకోని ప్రయాణికులకు సేవాపన్ను (Service Tax) ఎత్తివేసింది. ఈ నిర్ణయంతో ఇకపై ప్రయాణికులు రన్నింగ్‌ ట్రైన్‌లో టీ అయినా.. కాఫీ అయినా కేవలం రూ.20 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఇంతకు మునుపు ముందస్తుగా టీ, కాఫీ బుక్‌ చేసుకోని ప్రయాణికుల నుంచి అదనంగా రూ.50 సర్వీస్‌చార్జి వసూలు చేసేవారు. దీంతో మొత్తం కలిపి టీ, కాఫీకి (Tea, Coffee in premium trains) రూ.70 చెల్లించాల్సి వచ్చేది.

ఇటీవల సర్వీసు ఛార్జీకి సంబంధించిన బిల్లులు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో తాజాగా రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. రైళ్లలో కేటరింగ్ సర్వీసులను టిక్కెట్‌తో పాటు బుక్ చేసుకోని ప్రయాణికులకు ఈ కొత్త ఆర్డర్ కిందనే ఛార్జీలు విధించాలని రైల్వే బోర్డు పేర్కొంది. ఇదే సమయంలో మిగతా ఫుడ్‌ ఐటమ్స్‌కు రూ.50 సర్వీస్‌ చార్జి కొనసాగుతుందంటూ ఉత్తర్వులతో పాటు ఆహార పదార్థాలకు సంబంధించిన చార్ట్‌ను కూడా రైల్వే బోర్డు విడుదల చేసింది. ప్రీమియం రైళ్లలో శతాబ్ది, రాజధాని, వందే భారత్, తేజస్, దురంతో ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి.

గతంలో వ్యాట్ ద్వారా రాష్ట్రాలు బాగా సంపాదించాయి, మేము విధించిన జీఎస్టీ మొదటి సారి కాదు, 5 శాతం జీఎస్టీపై క్లారిటీ ఇచ్చిన ఆర్థిక మంత్రి నిర్మల

గతంలో అల్పాహారం, మధ్యాహ్న భోజనం మరియు సాయంత్రం స్నాక్స్ ధరలు వరుసగా ₹ 105, ₹ 185 మరియు ₹ 90 ఉండగా, ప్రతి భోజనంపై ₹ 50 అదనపు ఛార్జీ విధించబడేది. అయితే, ప్రయాణీకులు ఇప్పుడు ఈ భోజనాల కోసం ₹ 155, ₹ 235 మరియు ₹ 140 చెల్లించాల్సి ఉంటుంది, అలాగే భోజన ధరకు సర్వీస్ ఛార్జీ జోడించబడుతుంది. వందే భారత్ రైళ్ల కోసం, ఆన్-బోర్డ్ సర్వీసులను బుక్ చేసుకోని ప్రయాణికులు అల్పాహారం/లంచ్ లేదా డిన్నర్/సాయంత్రం స్నాక్స్ కోసం సర్వీస్ ఛార్జీలు వసూలు చేసినప్పుడు ఎంత మొత్తంలో ఖర్చు చేశారో అంతే మొత్తాన్ని ఛార్జీలకు బదులుగా ఆహారానికి వెచ్చించాల్సి ఉంటుంది.