రాజస్ధాన్‌లోని కోటాలో మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం జరిగిన ప్రదర్శనలో 14 మంది చిన్నారులకు గాయాలయ్యాయి.కున్హారి పోలీస్ స్టేషన్ పరిధిలోని సకటౌరా ప్రాంతంలో 10-16 సంవత్సరాల వయస్సు గల పిల్లలు హైటెన్షన్ విద్యుత్ లైన్ నుండి విద్యుదాఘాతానికి గురయ్యారు. విద్యుత్ షాక్‌తో గాయాలైన పిల్లలను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజస్ధాన్ ఇంధన శాఖ మంత్రి హీరాలాల్ నాగర్ ఆస్పత్రికి చేరుకుని గాయపడిన చిన్నారులను పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని వారు ఆస్పత్రి అధికారులను ఆదేశించారు. ఇద్దరు చిన్నారులకు వరుసగా 100, 50 శాతం కాలిన గాయాలు కాగా, మిగిలిన 12 మందికి 50 శాతం కంటే తక్కువ గాయాలయ్యాయని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతో వృద్ధుడిపై పైశాచికం.. నిప్పులపై నాట్యం చేయించి రాక్షసానందం.. థాణేలో ఘోరం
Here's ANI Video
#WATCH | Rajasthan: Several children were electrocuted during a procession on the occasion of Mahashivratri, in Kota. Further details awaited. pic.twitter.com/F5srBhO9kz
— ANI (@ANI) March 8, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)