Rajasthan Boat Tragedy (Photo-Twiter)

Kota, September 16: రాజస్థాన్ లో కోటా జిల్లాలోని ఇటావా పట్టణానికి సమీపంలోని ఖతోలీ ప్రాతంలో చంబల్ నదిని దాటుతున్న ఒక పడవ నీట (Rajasthan Boat Tragedy) మునిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 50 మంది ప్రయాణీకులు, 14 బైక్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోగా 20 మంది గల్లంతయ్యారు.

మిగిలిన వారిని స్థానికులు కాపాడారని కొంతమంది నదిలో గల్లంతయ్యారని పోలీసులు చెప్పారు.నది ప్రవాహ ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో సహాయ చర్యలు కాస్త కష్టంగా మారాయని అక్కడి పోలీసులు మీడియాకు తెలిపారు. వీరందరూ నది దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. బాధితులను కాపాడటానికి గాను గజ ఈతగాళ్లను పోలీసు అధికారులు రంగంలోకి దింపారు.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం గోఠలా కాలా సమీపంలోని కమలేశ్వర్ ఆలయానికి వెళుతున్న పడవ నదిలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్నవారు స్థానికుల సహాయంతో బతికి బయటపడ్డారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. పడవలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించిన కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. నదిలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.