Visual of Bharatpur where the incident took place (Photo/ANI)

Bharatpur, May 29: రాజస్థాన్​లో పట్టపగలే దారుణం (Rajasthan shot dead) చోటు చేసుకుంది. కారులో వెళ్తున్న ఓ జంటను అడ్డగించిన ఇద్దరు దుండగులు తుపాకులతో కాల్చి (Doctor Couple Shot Dead) చంపేశారు. దీంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ఈ ఘటన సీసీ కెమెరా ఫుటేజీ (CCTV Footage Goes Viral) ద్వారా ఆ వీడియో సోషల్ మీడియాలో గ్రూపులలో వైరల్ అవుతోంది. అయితే ఇవి ప్రతీకారహత్యలేనని పోలీసులు చెప్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. రాజస్థాన్​లోని భరత్​పూర్​ జిల్లా హెడ్​క్వార్టర్స్​లోని (Rajasthan's Bharatpur,Bharatpur) సెంట్రల్​ బస్టాండ్​ సర్కిల్​ వద్ద శుక్రవారం బైక్​పై వచ్చిన ఇద్దరు నిందితులు కారును అడ్డగించి.. అందులో ఉన్న జంటపై ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో ఆ జంట అక్కడికక్కడే చనిపోయింది. ఆ తర్వాత నిందితులు బైక్​పై ఉడాయించారు. మృతులను సుదీప్ గుప్తా, సీమా గుప్తాలుగా గుర్తించిన పోలీసులు, వాళ్లు డాక్టర్లని తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు భరత్​పూర్​ ఐజీ ప్రశాంత్​ కుమార్​ తెలిపారు.

Here's Doctor Couple Shot Dead Video

డాక్టర్లను హత్య చేసిన ఆ ఇద్దరు వ్యక్తులను అర్జున్ గుర్జాన్, మహేష్ గుర్జార్ గా గుర్తించామని, వాళ్లిద్దరూ (2019లో)చనిపోయిన మహిళ(దీప)కు సోదరులు అవుతారని, బహుశా డాక్టర్ల హత్య ప్రతీకార చర్య అయి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. తాజా ఘటనపై కేసు నమోదు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. సుదేశ్ క్లినిక్ లో అసిస్టెంట్ గా పనిచేసిన దీపా దేవి, ఆమె ఆరేళ్ల కొడుకు సూర్యా 2019లో హత్యకు గురయ్యారు. డాక్టర్​ సుదీప్​కు గతంలో ఆ మహిళతో వివాహేతర సంబంధం ఉంది.

యువ‌కుడిపై చేయి చేసుకున్న షాజాపూర్ అదనపు కలెక్టర్‌ మంజూషా విక్రంత్‌రాయ్, లాక్‌డౌన్ స‌మ‌యంలో చెప్పుల షాప్‌ నిర్వహించడమే కారణం, ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంద‌ని తెలిపిన రాష్ట్ర మంత్రి

కొన్నాళ్ల తర్వాత ఆ మహిళ, ఆమె ఐదేళ్ల బిడ్డ ఉన్న ఇంటికి నిప్పంటుకుని వాళ్లు చనిపోయారు. అయితే అది ప్రమాదం కాదని, సుదీప్​ కుటుంబమే ఆ దాష్టీకానికి పాల్పడిందని కేసు నమోదు అయ్యింది. దీంతో 2019లో సుదీప్​, అతని తల్లి, భార్య సీమాలు జైలుకు వెళ్లొచ్చారు. ఈ కేసులో బాధితురాలి సోదరుడే ఇప్పుడు నిందితుల్లో ఒకడైన అనుజ్. కాబట్టే ఇది ప్రతీకార హత్యగా పోలీసులు భావిస్తున్నారు. తాజా ఘటనపై కేసు నమోదు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.