Jaipur, July 10: రాజస్థాన్‌లోని పాలీ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మెడికల్ షాప్‌కు వెళ్లిన ఓ మహిళపై షాపు యజమాని దారుణానికి పాల్పడ్డాడు. ఆమె జ్వరంతో ఉందని కూడా చూడకుండా మత్తుమందు ఇచ్చి పది రోజుల పాటు తన కామ వాంఛలను తీర్చుకున్నాడు. ఈ క్రమంలో ఆమె తన కంటి చూపు (Woman Loses Eyesight After Being Drugged) కోల్పోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు జూన్ 18న మందుల కోసం మెడికల్ షాప్‌కు వెళ్లింది.
అయితే.. జ్వరం తగ్గే సూదిమందు ఇస్తానంటూ నమ్మబలికిన షాపు యజమాని ఆమెకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఆ తరువాత బాధితురాలిని అపహరించి డెహ్రాడూన్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను పది రోజుల పాటు నిర్బంధించి అత్యాచారానికి (Molested for Days) పాల్పడ్డాడు. తన ప్రయాత్నాలకు ఆమె అడ్డుపడకుండా ఉండేందుకు బాధితురాలికి పలు మార్లు మత్తుమందు ఇచ్చాడు. ఈ కమ్రంలో ఆమె చూపు కోల్పోయింది. జరిగిన దారుణం గురించి బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఇటీవలే నిందితుడిని అరెస్టు చేశారు. మత్తుమందు ప్రభావం కారణంగానే ఆమె చూపు కోల్పోయిందని వైద్యులు చెప్పినట్టు స్థానిక ఎస్పీ వెల్లడించారు.
బాలుడిపై వికృతచేష్టలు: ఇక తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలో (TS KarimNagar) దారుణ ఘటన చోటు చేసుకుంది. బాలుడిపై వికృతచేష్టలకు (misbehave) పాల్పడడంతోపాటు ఆ విషయం ఎవరిౖకైనా చెబితే చంపుతానని బెదిరించిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.1200 జరిమానా విధిస్తూ కరీంనగర్ ప్రత్యేక పోక్సో న్యాయస్థానం గురువారం తీర్పునిచ్చింది.
ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం... చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన బాలుడిని 2017 మార్చి 19 తేదీన ఆదే గ్రామానికి చెందిన నూనె రవి అనే వ్యక్తి భూపాలపట్నంలో ఎవరూ లేని శివారు ప్రాంతానికి తీసుకెళ్లి తన మర్మాంగాన్ని బాలుడి నోట్లో పెట్టి వికృతచేష్టలకు పాల్పడ్డాడు.
ఈ విషయం ఎవరికైనా చంపుతానని బెదిరింపులకు గురిచేశాడు. సీఐ సిహెచ్ రమేశ్ కేసును విచారణ చేసి కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. సాక్షులను ఏపీపీ వెంగళదాస్ శ్రీనివాస్ విచారించారు. కరీంనగర్ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి మాధవికృష్ణ, నూనె రవికి ఏడేళ్ల జైలుతోపాటు రూ.1200 జరిమానా విధిస్తూ గురువారం తీర్పునిచ్చారు.