Rajasthan Shocker: అర్థరాత్రి దారుణం, పొలంలో పడుకుని ఉన్న వృద్ధుడి తలను పగులకొట్టిన దుండుగులు, 10 మంది గ్రామస్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. రాత్రిపూట తన పొలంలో పడుకొని ఉన్నాడా 70 ఏళ్ల వృద్ధుడు. అలాంటి సమయంలో అక్కడకు వచ్చిన కొందరు బండరాయితో అతని తల పగలగొట్టి చంపేశారు.
Baran, July 1: రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. రాత్రిపూట తన పొలంలో పడుకొని ఉన్నాడా 70 ఏళ్ల వృద్ధుడు. అలాంటి సమయంలో అక్కడకు వచ్చిన కొందరు బండరాయితో అతని తల పగలగొట్టి చంపేశారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని బరాన్ జిల్లాలో గల కోటా ప్రాంతంలో (Rajasthan Shocker) వెలుగు చూసింది. కన్హీ అలియాస్ కన్హయలాల్ మీనా అనే 70 ఏళ్ల వృద్ధుడు కొంత కాలంగా కుటుంబానికి దూరంగా ఉంటున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే ఖేర్‌ఖేడా గ్రామంలోని తన పొలంలో ఉంటున్నాడు. అతను అక్కడ ఉండగానే ఎవరో కన్హయలాల్‌ను హత్య(70-year-old man killed) చేయడం జరిగింది. అతని తలకు బలమైన గాయం తగలడం వల్లే మరణం సంభవించిందని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. దీంతో బండరాయితో అతని తల పగలగొట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు.అతనికి దూరంగా ఉంటున్న కుటుంబ సభ్యులే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు మేరకు 10-12 మంది గ్రామస్థులను పోలీసులు అదుపులోకి (Baran at least 10 booked) తీసుకున్నారు. దర్యాప్తు జరుగుతోందని, త్వరలోనే హంతకులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.హత్య వెనుక గల కారణాలను నిర్ధారించలేనప్పటికీ, మీనా ఇటీవల తమ బంధువులలో ఒకరిని విద్యుదాఘాతంతో చంపిందని అనుమానితుడు పోలీసులకు చెప్పాడు.
(The above story first appeared on LatestLY on Jul 01, 2022 10:13 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

