6 TMC MPs Suspended: ఆరుగురు టీఎంసీ సభ్యుల సస్పెన్షన్‌, పెగాసస్‌ అంశంపై చర్చ జరపాలంటూ వెల్‌లోకి దూసుకొచ్చి ఫ్లకార్డులు ప్రదర్శించిన తృణమూల్ ఎంపీలు, 255 నిబంధనను అమలు చేస్తున్నట్లు ప్రకటించిన వెంకయ్యనాయుడు
Parliament Monsoon Session 2021 (Photo-Video Grab)

New Delhi, August 4: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 12వ రోజుకు చేరుకున్నాయి. రాజ్యసభలో ఆరుగురు సభ్యులపై సస్పెన్షన్‌ వేటు (6 TMC MPs suspended) పడింది. వెల్‌లోకి దూసుకొచ్చిన తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు ఫ్లకార్డులు ప్రదర్శించారు. దీంతో రూల్‌ 225 ప్రకారం ఆరుగురు టీఎంసీ ఎంపీలను రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు (Rajya Sabha Chairman Venkaiah Naidu) ఒకరోజుపాటు సస్పెండ్‌ చేశారు. కాగా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను పెగాసస్‌ హ్యాకింగ్‌ వ్యవహారం కుదిపేస్తోన్న విషయం తెలిసిందే. సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి ఈ అంశంపై చర్చ జరపాలని ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేస్తూనే ఉన్నారు.

ఈ క్రమంలోనే ఉభయ సభల్లో చర్చలకు ఆస్కారం లేకుండా వాయిదాల పర్వం కొనసాగుతోంది. బుధవారం ఉదయం కూడా రాజ్యసభలో టీఎంసీతో పాటు ఇతర విపక్ష ఎంపీలు పెగాసస్‌ అంశంపై చర్చ జరగాలని డిమాండ్‌ చేస్తూ నిరసనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్‌లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విపక్ష సభ్యులు ఆందోళన విరమించాలని, తమ తమ సీట్లలో కూర్చోవాలని ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు తొలుత సూచించారు. లేదంటే ప్లకార్డులు పట్టుకున్నందుకు 255 నిబంధనను అమలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అయినప్పటికీ వారు పట్టువిడవలేదు.

దేవినేని ఉమకు బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు, వారం రోజుల పాటు జైలులో గడిపిన టీడీపీ నేత

దీంతో రాజ్యసభ ఛైర్‌ను అగౌరవపర్చిన వారిపై 255 నిబంధనను అమలు చేస్తున్నట్లు ప్రకటించిన వెంకయ్యనాయుడు సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఆ తర్వాత రాజ్యసభ సెక్రటేరియట్‌ నిబంధనకు గురైన సభ్యుల పేర్ల జాబితాను విడుదల చేసింది. టీఎంసీకి చెందిన డోలా సెన్‌, మహ్మద్‌ నదీముల్‌ హక్‌, అబిర్‌ రంజన్‌ బిశ్వాస్‌, శాంత ఛెత్రి, అర్పితా ఘోష్‌, మౌసమ్‌ నూర్‌ను ఒకరోజు పాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది.

పోలవరంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీలు లోక్‌సభలో వాయిదా తీర్మానం చేశారు. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి స్పీకర్‌కు నోటీసు అందజేశారు. పోలవరం సవరించిన అంచనాలకు క్యాబినెట్ ఆమోదముద్ర వేయాలని వైఎస్సార్‌సీపీ సభ్యులు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పెగసస్ స్పైవేర్ నిఘా వ్యవహారంపై చర్చ, వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌తో ప్రతిపక్షాలు వెల్‌లోకి దూసుకొచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన గళాన్ని వినిపిస్తున్నాయి.