Ram Temple Invitation Card: భూమి పూజ ఇన్విటేషన్ కార్డ్ పస్ట్ లుక్ ఇదే, విశిష్ట అతిథిగా ఆరెస్సెస్ చీఫ్ మోహన్‌రావు భాగవత్, ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమి పూజ
Ram temple bhoomi pujan invitation card (Photo Credits: Twitter)

New Delhi, August 3: అయోధ్య రామ మందిర నిర్మాణం భూమి పూజకు సర్వం సిద్ధమైంది. భూమి పూజ కార్యక్రమానికి ఇన్విటేషన్ కార్డు రెడీ (Ram Temple 'Bhoomi Pujan' Invitation Card) అయింది. కాషాయం రంగులో ఉన్న ఈ కార్డుపై ప్రధాని మోదీతో పాటు మరో ముగ్గురి పేర్లు మాత్రమే ఉన్నాయి. మోదీ చేతుల మీదుగా భూమి పూజ జరుగుతున్నట్టు కార్టులో పేర్కొన్నారు. ఆగస్టు 5 న జరగబోయే అమోధ్య భూమిపూజ (Ram Temple 'Bhoomi Pujan') నిమిత్తమై తయారు చేసిన ఆహ్వాన పత్రికలో మొట్ట మొదటి పేరు ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi). ఆ తర్వాత విశిష్ట అతిథి హోదాలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్‌రావు భాగవత్ (Mohan Bhagwat) పేరుంది. అయోధ్య భూమి పూజకు కరోనా భయం, దూరంగా ఉంటానని ప్రకటించిన ఉమాభారతి, ఈవెంట్‌ను వ‌ర్చువ‌ల్‌గా వీక్షించ‌నున్న అద్వానీ, జోషీ

ఆ తర్వాత గవర్నర్ ఆనందీబేన్ పటేల్ పేరు, సీఎం యోగి ఆదిత్యనాథ్ పేరు ఉంది. ఈ పేర్ల తర్వాత ముహూర్తాన్ని పేర్కొన్నారు. ఈ వివరణ అంతా పూర్తైన తర్వాత చివరగా ట్రస్ట్ అధ్యక్షులు మహంత్ నృత్య గోపాల్ దాస్ పేరును పేర్కొన్నారు. రామ మందిర ట్రస్ట్ ఛైర్మన్ మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆహ్వానిస్తున్నట్టు కార్డు ఉంది. కార్డుపై బాల రాముడి చిత్రాన్ని ముద్రించారు. ఈ ఆహ్వాన పత్రికను దాదాపు 150 మంది అతిథులకు పంపినట్టు సమాచారం.

Ayodhya "Bhoomi Pujan" Invitation Card:

ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో జరిగే రామమందిర నిర్మాణం మంచి అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని, శంకుస్థాపన వేడుక రోజున మట్టి దీపాలను వెలిగించాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రజలను కోరారు. ‘ అయోధ్య రామ మందిర నిర్మాణంతో ప్రధాని మోడీ నాయకత్వంలో దేశానికి రామ రాజ్యం వస్తుందని నాకు నమ్మకం ఉంది. ఆగస్టు 4 & 5 తేదీ రాత్రుల్లో ప్రజలందరూ వారి ఇళ్ళ వద్ద మట్టి దీపాలను వెలిగించాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

అనేక మంది ప్రముఖులు, కనీసం 200 మంది అర్చకులు పాల్గొనే ఈ వేడుకలో ప్రధాని మోదీ రామ మందిరానికి బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. రామ మందిర కాంప్లెక్స్‌లో ఉన్న 14 మంది పోలీసు సిబ్బందికి, పూజరులకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. అలాగే ఆ కార్యక్రమానికి ఆహ్వానించిన కొందరి ప్రముఖులకు, అదేవిధంగా హోం మంత్రి అమిషాతో పాటు శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు కూడా కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చింది. ఏదేమైనా, కరోనా నేపథ్యంలో అన్ని భద్రతా నియమాలను పాటిస్తూ, ప్రణాళిక ప్రకారం అన్ని ముందుకు సాగుతాయని ఆలయ ట్రస్ట్ తెలిపింది.