Ram Temple: ఎల్ అండ్ టీ చేతికి రామ మందిర్ నిర్మాణం, ఉక్కుతో కాకుండా రాగితో రామాలయం, ప్రజలంతా రాగిని దానం చేయాలని కోరిన రామ్ మందిర్ ట్రస్ట్, 36 నుంచి 40 నెలల కాలంలో నిర్మాణం పూర్తి
Proposed model of Ram temple (Photo Credits: Shri Ram Janmabhoomi Teerth Kshetra)

Ayodhya, August 20: అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రారంభమైందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ గురువారం ప్రకటించింది. భారతీయ సనాతన, ప్రాచీన నిర్మాణ పద్ధతుల్లోనే నిర్మిస్తామని (Ram Temple's Construction) స్పష్టం చేసింది. రామ మందిర (Ram Mandir) నిర్మణానికి సంబంధించి ఈ నెల 5న ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆలయాన్ని నిర్మించే ప్రాంతంలో ప్రస్తుతం ఎల్ అండ్ టీ (L &T) సంస్థతో కలిసి ఐఐటీ మద్రాస్, సీబీఆర్ఐ రూర్కీ ఇంజనీర్లు మట్టిని పరీక్షిస్తున్నారు. 36 నుంచి 40 నెలల కాలంలో ఆలయం నిర్మాణం పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ఎల్ అండ్ టీ కంపెనీ నిర్మాణ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న‌ది.

ఈ సందర్భంగా రామ జన్మభూమి ట్రస్ట్ (Ram Janmabhoomi Teerth Kshetra) ట్వీట్‌ చేసింది. ‘మన పురాతన, సంప్రదాయబద్ధమైన నిర్మాణ నైపుణ్యాలను అనుసరించి మందిర నిర్మాణం (Ram Temple Design) జరుగుతుంది. భూకంపాలు, తుపానులతో పాటు అన్ని ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే విధంగా ఆలయాన్ని నిర్మిస్తున్నాము. మందిర నిర్మాణంలో ఉక్కును వాడటం లేదు’ అంటూ ట్వీట్‌ చేసింది. అయోధ్య రామ మందిర ట్రస్ట్ సభ్యుల సమావేశం గురువారం జరిగింది. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడేలా ఈ మందిర నిర్మాణం ఉంటుందని, ఇంజినీర్లు ఇప్పటికే మట్టిని పరీక్షించారని కూడా పేర్కొంది. ఈ రామ మందిర నిర్మాణం 36 నుంచి 40 నెలల్లో పూర్తవుతుందని ట్రస్ట్ ప్రకటించింది.

Here's what the RJTK said: 

ఈ ఆలయ నిర్మాణంలో అసలు ఇనుమును ఉపయోగించమని ట్రస్ట్ ప్రకటించింది. ఈ నిర్మాణంలో వాడే రాళ్ల మధ్యలో 18 అంగుళాల పొడవు, 30 మి.మీ. వెడల్పు ఉన్న రాగి పలకలను వాడతామని, వీటిని భారీ సంఖ్యలో దానం చేయాలని రామ భక్తులకు పిలుపునిస్తామని ట్రస్ట్ పేర్కొంది. ఆ రాగి పలకలపై దాతలు తమ పేర్లు కూడా రాసుకునే సౌలభ్యం కల్పిస్తున్నామని, ఇలా రాగి పలకలను దానం చేయడం జాతి ఐక్యతకు సంకేతమని పేర్కొంది.  అయోధ్య రామ మందిరం నమూనా ఇదే, భారతీయ వాస్తుశిల్పకతకు అద్దంపట్టేలా రామమందిర్ నిర్మాణం

ట్ర‌స్టు జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ చంప‌త్ రాయ్‌.. రామ‌మందిర వివ‌రాల‌ను బుధ‌‌వారం వెల్ల‌డించారు. హిందూ భ‌క్తులు ఆల‌య నిర్మాణం కోసం రాగిని విరాళం ఇవ్వాలంటూ ఆయ‌న కోరారు. 1990లో శిల‌ల‌ను దానం చేసిన‌ట్లుగానే.. దేశ‌వ్యాప్తంగా ఉన్న హిందువులంతా రాగి వైర్లు కానీ, రాడ్లు కానీ దానం చేయాల‌న్నారు. క‌నీసం వెయ్యేళ్లు చెక్కుచెద‌ర‌కుండా ఉండే విధంగా ఆల‌యాన్ని నిర్మించ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు

భూకంపాల నుంచి ఆల‌యాన్ని ర‌క్షించుకునే విధంగా ఉండేందుకు సెంట్ర‌ల్ బిల్డింగ్ రీస‌ర్చ్ ఇన్స్‌టిట్యూట్ శాస్త్ర‌వేత్త‌లు ప‌నిచేయ‌నున్న‌ట్లు చంప‌త్ రాయ్ చెప్పారు. భ‌క్తులు ఇచ్చిన రాగితో అయోధ్య ఆల‌య‌ నాణ్య‌త మ‌రింత పెర‌గ‌నున్న‌ట్లు తెలిపారు. నిర్మాణం కోసం రాగి రాడ్లు అవ‌స‌ర‌మ‌ని, కనీసం ప‌ది వేల రాడ్లు అవ‌స‌రం ఉంటుంద‌న్నారు. నిర్మాణం కోసం కేవ‌లం రాళ్లను వాడ‌నున్న‌ట్లు చెప్పారు. ఉక్కును వినియోగించ‌డం లేద‌న్నారు. ముస్లింలు కూడా ఆల‌య నిర్మాణం కోసం విరాళాలు ఇవ్వ‌వొచ్చు అన్నారు.