Ranjit Singh Murder Case: మహిళలను సెక్స్ బానిసలుగా చేసుకున్న డేరాబాబాకు జీవిత ఖైదు, రంజిత్ సింగ్ హత్య కేసులో గుర్మీత్ రామ్ రహీమ్‌, మరో నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన పంచకుల ప్రత్యేక సీబీఐ కోర్టు
Gurmeet Ram Rahim Singh (Photo Credits: ANI)

Panchkula, October 18: 2002లో సంచలనం రేపిన రంజిత్ సింగ్ హత్య కేసులో (Ranjit Singh Murder Case) డేరా సచ్చా సౌదాకు చెందిన గుర్మీత్ రామ్ రహీమ్‌ (Dera Chief Gurmeet Ram Rahim), మరో నలుగురికి పంచకులలోని ప్రత్యేక సీబీఐ కోర్టు సోమవారంనాడు యావజ్జీవ కారాగారవాస శిక్ష విధించింది. దీనితో పాటు డేరా బాబాకు రూ.31 లక్షల జరిమానా, అవతార్ సింగ్‌కు రూ.1.50 లక్షలు, సబ్దీల్ సింగ్‌కు రూ.1.25 లక్షలు, జస్బీర్ సింగ్, కృష‌న్‌ లాల్‌కు చెరో రూ.75 వేల చొప్పున‌ జరిమానా విధించింది. జరిమానా సొమ్ములో 50 శాతం బాధిత కుటుంబానికి అందజేయనున్నట్టు కోర్టు స్పష్టం చేసింది.

రంజిత్ సింగ్‌ హ‌త్య కేసులో డేరా బాబాతోపాటు అవతార్ సింగ్, కృష‌న్‌ లాల్, జస్బీర్ సింగ్, సబ్దీల్ సింగ్‌లను దోషులుగా పేర్కొంటూ కోర్టు ఈ నెల 8న తీర్పు చెప్పింది. శిక్ష‌ల ఖరారును ఇవాళ్టికి వాయిదా వేసింది. ఆ మేర‌కు ఇవాళ నిందితులు ఐదుగురికీ శిక్ష‌లు (4 Others Awarded Life Imprisonment ) ఖ‌రారు చేసింది. డేరా సచ్చా సౌదాకు అనుచరుడిగా పేరున్న రంజిత్ సింగ్ 2002 జూలై 10న హత్యకు గురయ్యారు. కురుక్షేత్రలోని ఖాన్పూర్ కొలియన్ గ్రామానికి చెందిన రంజిత్ సింగ్ తన గ్రామంలో పొలం పనులు చేసుకుంటుండగా అతన్ని అగంతకులు కాల్చిచంపారు.

రైల్ రోకో వల్ల 30 ప్రాంతాల్లో రైల్ ట్రాఫిక్‌కు అంతరాయం, మరింత తీవ్రరూపం దాల్చిన రైతుల ఉద్యమం

కాగా, 2003లో పంజాబ్, హర్యానా హైకోర్టు ఉచ్చిన ఉత్తర్వులతో సీబీఐ కేసు నమోదు చేసింది. దీనికి ముందు ఈ కేసు సదర్ పోలీస్ స్టేషన్‌లో నమోదయింది. కేసు దర్యాప్తును తమ అధీనంలోకి తీసుకున్న సీబీఐ నాలుగేళ్ల పాటు విచారణ జరిపి 2007 జూలైలో ఆరుగురు నిందితులపై ఛార్జిషీటు నమోదు చేసింది. 2008 డిసెంబర్‌లో ఆరోపణలు నమోదు చేసింది. విచారణ సమయంలో నిందితులలో ఒకరైన ఇందర్ సైన్‌ గత ఏడాది మరణించాడు.

అజయ్ మిశ్రాను వెంటనే మంత్రి పదవి నుంచి తప్పించాలి, అరెస్ట్ చేయాలి, ఈ డిమాండ్లతో రైల్‌ రోకోకు పిలుపునిచ్చిన సంయుక్త కిసాన్‌ మోర్చా, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిరసనలు

కాగా ఆశ్రమంలోని మహిళలను సెక్స్ బానిసలుగా చేసుకుని డేరా బాబా చేస్తున్న అరాచకాలకు సంబంధించి అప్ప‌ట్లో ఒక లేఖ బ‌య‌టికి వ‌చ్చింది. అయితే, త‌న అరాచ‌కాల‌ను బయటి ప్రపంచానికి తెలియజెప్పడానికి రంజిత్ సింగే ఆ ప‌ని చేసిన‌ట్లు డేరా బాబా అనుమానించి హ‌త్య చేయించాడు. కాగా, ఆశ్రమంలోని ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసిన కేసులో కూడా డేరా బాబాకు ఇప్ప‌టికే 20 ఏండ్ల‌ జైలుశిక్ష పడింది. ఆయ‌న‌ భక్తి ముసుగులో మహిళలను సెక్స్ బానిసలుగా మార్చినట్టు రుజువైంది. దేశవ్యాప్తంగా వందల కోట్ల రూపాయల ఆస్తుల్ని వెనకేసుకున్న‌ట్లు తేలింది. భక్తి పేరుతో కారుచౌకగా భూములను కొనుగోలు చేసి తాను న‌మ్మిన భక్తుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. రిజిస్ట్రేషన్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్న‌ట్లు ద‌ర్యాప్తులో బ‌య‌ట‌ప‌డింది.