New Delhi, December 5: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ స్థూల జాతీయోత్పత్తి (GDP) అంచనా వృద్ధి రేటును మరోసారి తగ్గించింది. జిడిపి వృద్ధిని 6.1 నుంచి 5 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర బ్యాంకుకు చెందిన ద్రవ్య విధాన సమీక్ష కమిటీ (MPC- Monetary Policy Committee) గురువారం ప్రకటించింది.
ఈ ఏడాది ఆరంభంలో అంచనా వేసిన 7.4 శాతం రేటుకు బదులుగా, ఆర్థిక వ్యవస్థ 6.1 శాతంగా పెరుగుతుందని ఎంపిసి అంచనా వేసిన రెండు నెలలకే జిడిపి వృద్ధి సూచన ఇప్పుడు గణనీయంగా 5 శాతానికి పడిపోయింది. ఈ ప్రకారంగా గత ఆరు నెలల్లో ఆర్బిఐ తన జిడిపి వృద్ధి అంచనాను 2.4 శాతం పాయింట్ల మేర తగ్గించింది. ప్రపంచ ఆర్థిక మందగమనమే ఇందుకు కారణం అని కమిటీ తెలిపింది.
Check out the video:
Governor, Reserve Bank of India’s Press Conference
— ReserveBankOfIndia (@RBI) December 5, 2019
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణ లక్ష్యాలను కమిటీ సవరించింది. డిమాండ్ మందగించినప్పటికీ ద్రవ్యోల్బణం పెరుగుతున్న చోట ఆర్బిఐ రిటైల్ ద్రవ్యోల్బణ అంచనాను రెండవ ఆర్థిక సంవత్సరానికి 4.7 నుంచి 5.1 శాతానికి సవరించింది.
2019-20 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో, ఆర్‌బిఐ రిటైల్ ద్రవ్యోల్బణం (Inflation) వృద్ధి రేటు త ఎంపిసి సమావేశంలో అంచనా వేసిన 3.4 శాతం కంటే ఎక్కువగా 4.6 శాతానికి పెరిగిందని పేర్కొంది.
ఇక వృద్ధి రేటు మెరుగుపడే వరకు రెపో రేటును తగ్గించకూడదని వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రేటు 5.15 శాతం యధాతథంగా కొనసాగించాలని సెంట్రల్ బ్యాంక్ నిర్ణయించింది. ప్రస్తుత రివర్స్ రెపో రేటు 4.9 శాతం మరియు బ్యాంక్ రేటు 5.4 శాతంగా ఉన్నాయి.