ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరిగిపోతూ ఉండటంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అధికారికంగా ప్రకటించారు. దీంతో రెపో రేటు 4.40 శాతానికి చేరుకుంది. పెంచిన రేటు తక్షణమే అమల్లోకి వస్తుందని శక్తికాంత దాస్ ప్రకటించారు. ద్రవ్యోల్బణం అదుపు చేసేందుకు సర్దుబాటు దోరణిని ఉపసంహరించుకునే యోచనలో ఉన్నట్లు గవర్నర్ వెల్లడించారు. ఈ నిర్ణయం వెలువడటంతో మధ్యాహ్నం 2.20 గంటల సమయానికి సెన్సెక్స్ 956 పాయింట్ల భారీ నష్టపోయి 567019 వద్ద నిఫ్టీ 300 పాయింట్లు నష్టపోయి 16781 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది.
మే 2020 తర్వాత తొలిసారి ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచింది. ఆహార ద్రవ్యోల్బణం అధికంగా ఉండనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా గోధుమ సంక్షోభం ఏర్పడినట్లు ఆయన తెలిపారు. దీని వల్ల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల నూనె ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నట్లు దాస్ తెలిపారు.
RBI hikes benchmark interest rate by 40 bps to 4.40 pc in an unscheduled policy review with a view to contain inflation
— Press Trust of India (@PTI_News) May 4, 2022
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)