New Delhi, June 7: కీలక వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) యధాతథంగా ఉంచింది. వరుసగా ఎనిమిదోసారి కూడా వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు చేయడం లేదని, రెపో రేటు (RBI Repo rate) 6.5 శాతంగానే స్థిరంగా కొనసాగనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ద్రవ్య పరపతి కమిటీ వివరాలను ఆయన వెల్లడిస్తూ.. ఆర్థిక వృద్ధి రేటు మెరుగ్గా ఉన్న కారణంగానే ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందన్నారు.
గత కొన్నాళ్ల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక సంక్షోభం వస్తూనే ఉన్నదని,అయినప్పటికీ భారతీయ ఆర్థిక వ్యవస్థ మాత్రం బలమైన పునాదులతో ఉందని, ఇలాంటి అస్థిర వాతావరణంలో చాలా అప్రమత్తంగా ఉండాలని గవర్నర్ దాస్ పేర్కొన్నారు.రెపో రేటును 6.5 శాతం వద్దే ఉంచామన్నారు. ఇంధన ధరల్లో ప్రతిద్రవ్యోల్బణం నమోదవుతోందని తెలిపారు. అయినప్పటికీ.. ధరల పెరుగుదలపై ఎంపీసీ అప్రమత్తంగా ఉందని వెల్లడించారు. ద్రవ్యోల్బణం, వృద్ధి మధ్య సమతుల్యత అనుకూలంగా ఉందన్నారు. ఆహార ద్రవ్యోల్బణమే కొంత వరకు ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. కీలక వడ్డీ రేట్లు యథాతథం.. 6.50% వద్ద యథాతథంగా రెపో రేటు.. ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ నిర్ణయం
కాగా గతంలో 2023లో చివరిసారి రెపో రేటును మార్చినట్లు తెలుస్తోంది. రెపో రేటును యధాతథంగా ఉంచేందుకు ఆరుగురు ఎంపీసీ సభ్యుల్లో నలుగురు అనుకూలంగా ఉన్నారు. గవర్నర్ మాట్లాడుతూ.. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం లోపునకు తీసుకురావడానికి ఆర్‌బీఐ కట్టుబడి ఉంది.నైరుతి రుతుపవనాలతో ఖరీఫ్ సాగు ఉత్పత్తి పెరుగుతుందని ఆశిస్తున్నాం. రిజర్వాయర్లలో నీటిమట్టాలు పెరుగుతాయనుకుంటున్నారు. 2024-2025 వృద్ధిరేటు అంచనా 7.5 శాతం. ఇది కార్యరూపం దాల్చితే వరుసగా నాలుగో ఏడాది 7 శాతం ఎగువన వృద్ధి నమోదైనట్లు అవుతుందని తెలిపారు.
Here's Video
#WATCH | RBI Governor Shaktikanta Das says "...The Monetary Policy Committee decided by a 4:2 majority to keep the policy repo rate unchanged at 6.5%. Consequently, the standing deposit facility (SDF) rate remains at 6.25%, and the marginal standing facility (MSF) rate and the… pic.twitter.com/MEOT3e3q1L
— ANI (@ANI) June 7, 2024
ఆహార ద్రవ్యోల్బణాన్ని నిశితంగా పర్యవేక్షించాల్సి ఉందన్నారు. ప్రపంచ రెమిటెన్స్‌లలో భారత్ వాటా 15.2 శాతం. తద్వారా విదేశీ ద్రవ్యాన్ని పొందుతున్న అతిపెద్ద దేశంగా కొనసాగుతోందన్నారు. ఎఫ్‌డీఐలు బలంగా కొనసాగుతున్నాయి. నికరంగా చూస్తే మాత్రం తగ్గుదల నమోదైంది.వస్తు-సేవల ఎగుమతులు-దిగుమతులకు సంబంధించిన ఫెమా నిబంధనలను హేతుబద్ధీకరించాలని సూచించారు. అన్‌సెక్యూర్డ్ లోన్ల జారీని మరింత అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
2024-25 రిటైల్ ద్రవ్యోల్బణ అంచనాలు..
ఆర్థిక సంత్సరం - 4.5%
తొలి త్రైమాసికం - 4.9%
రెండో త్రైమాసికం - 3.8%
మూడో త్రైమాసికం - 4.6%
నాలుగో త్రైమాసికం - 4.5%