Received Money From Stranger UPI: తెలియని నెంబర్ నుంచి మీ యూపీఐ అకౌంట్‌కు డబ్బులు వచ్చాయా? అయితే మీ అకౌంట్ డేంజర్‌లో పడ్టట్లే, తిరిగి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తే అంతే సంగతులు, కొత్త తరహా మోసానికి పాల్పడుతున్న క్రిమినల్స్
UPI Cyber Crime (PIC @ Wikimedia Commons and pixabay)

Mumbai, March 18: ఫోన్ పే (Phone pay), గూగుల్ పే (G Pay) వంటి యూపీఐ ()UPI) ద్వారా తెలియని నెంబర్ల నుంచి మనీ వచ్చిందా? అయితే జాగ్రత్త! ఎందుకంటే మీరు సైబర్ క్రైమ్ బారిన (Cyber attack) పడొచ్చు. సైబర్ నేరగాళ్లు ముందు ఇలా మనీ పంపి.. తర్వాత మీ మనీ మొత్తం కాజేయొచ్చు. ఇటీవల ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. ముంబైలోనే సైబర్ నేరగాళ్లు ఇలా 81 మంది నుంచి కోటి రూపాయలు పైగా కొట్టేశారు. సైబర్ నేరగాళ్లు ఫోన్ పే, గూగుల్ పే వంటి మీ యూపీఐ అకౌంట్‌కు ముందుగా మనీ పంపిస్తారు. తెలియని నెంబర్ నుంచి మనీ ఎవరు పంపారా అని ఆలోచించే లోపే మీకు కాల్ వస్తుంది. వేరే నెంబర్‌కు పంపాల్సిన అమౌంట్ పొరపాటున మీకు ట్రాన్స్‌ఫర్ (Transfer) అయిందని, వెంటనే తమకు ఆ డబ్బులు రిటర్న్ చేయమని అడుగుతురు. వాళ్లు చెప్పిన నెంబర్‌కు, చెప్పినట్లు డబ్బు తిరిగి పంపాలని రిక్వెస్ట్ చేస్తారు. ఇది నిజమే అని వాళ్లకు ఆ డబ్బు తిరిగి పంపారో.. అంతే సంగతులు!

Modi Govt Plan For Data Theft: మొబైల్ యూజర్ల కోసం కేంద్రం కీలక నిర్ణయం, ఇకపై డాటా చౌర్యం జరుగకుండా కఠిన నిబంధనలు, ప్రి ఇన్‌స్టాల్డ్ యాప్స్ విషయంలో జాగ్రత్త అంటూ హెచ్చరిక 

మీ అకౌంటుకు సంబంధించిన సమాచారం మొత్తం వాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంది. మీ బ్యాంక్ అకౌంట్లు, పాస్ వర్డ్, పాన్, ఆధార్ వంటి కేవైసీ డీటైల్స్ సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లిపోతాయి. మీ అకౌంట్ నుంచి డబ్బులు కాజేయడానికి వాళ్లకు ఈ వివరాలు చాలు. మీ అకౌంట్లో ఉన్న డబ్బును వాళ్లు తెలివిగా కొట్టేస్తారు. సైబర్ నేరగాళ్లు ఇటీవల కొత్తగా అనుసరిస్తున్న పంథా ఇది.

Pan Aadhaar Linking: పన్ను చెల్లింపుదారులకు మరోసారి అలర్ట్, మార్చి 31వ తేదీలోపు పాన్-ఆధార్ లింక్ చేసుకోవాలని సూచించిన ఆదాయపు పన్ను శాఖ 

అందుకే కొత్త నెంబర్ నుంచి మీ యూపీఐ అకౌంట్‌కు డబ్బులు క్రెడిట్ అయ్యి.. వాటిని ఎవరైనా తిరిగి పంపాలి అని కోరితే ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి. మీరు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడతారేమో ఆలోచించాలి అని పలువురు సైబర్ క్రైమ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు