 
                                                                 Reasons For NRIs Not Returning To India: ఉన్నత విద్య కోసం, మంచి ఉద్యోగం కోసం ఏటా మన దేశం నుంచి వేలాది మంది విదేశాలకు వెళుతున్నారు.. అయితే, వెళ్లిన వారిలో తిరిగి వచ్చే వారి సంఖ్య మాత్రం వందల్లోనే ఉంటోంది.వెళ్లిన వాళ్లు అక్కడే స్థిరపడిపోతున్నారు. నాన్ రెసిడెంట్ ఇండియన్లు (ఎన్ఆర్ఐలు) గా మిగిలిపోతున్నారు. ఈ విషయంపై ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం రెడ్డిట్ లో చర్చ జరుగుతోంది.
యూకేలో స్థిరపడిన ఎన్ఆర్ఐ ఒకరు తన పోస్టులో ‘’ అంటూ తోటి ఎన్ఆర్ఐలను ప్రశ్నించాడు. దీనికి చాలామంది ఎన్ఆర్ఐలు స్పందిస్తూ రకరకాల కారణాలను కామెంట్ల ద్వారా చెబుతున్నారు. ఆర్థికంగా పైకి ఎదగడానికే అయినవాళ్లకు దూరంగా బతుకుతున్నామని చాలామంది వెల్లడించారు.
పుట్టినరోజు నాడే తిరిగిరాని లోకాలకు, కెనడాలో ఈతకు వెళ్లి తెలుగు యువకుడు మృతి
ఇండియాలో నచ్చిన ఉద్యోగం దొరికే పరిస్థితిలేదని మరికొందరు, ఇక్కడున్న వసతులు మన దేశంలో లేవని, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసమని మరికొందరు, నేరాలకు దూరంగా ప్రశాంతంగా, ధైర్యంగా బతకడం కోసమని ఇంకొందరు చెబుతున్నారు. ప్రజా రవాణా వ్యవస్థ, రోడ్ల పరిస్థితి, ఇండియన్లలో సివిక్ సెన్స్ తక్కువని, కాలుష్యంలేని వాతావరణం కోసమని, పరిశుభ్రమైన నీరు, ఆహారం, మన దగ్గరి నుంచి వసూలు చేసే పన్నులు మన కోసమే ఉపయోగపడతాయని.. ఇలా చాలా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Indians abroad - what's stopping you from returning to India?
Indians abroad - what's stopping you from returning to India?
ఇక కొంతమంది మాత్రం ఇండియాలోని తమ బంధువులు, మన సంస్కృతి, సంప్రదాయాల కోసం, మాతృదేశ అభివృద్ధిలో పాలుపంచుకోవడానికి తిరిగి వెళ్లిపోవాలని ఉందని అభిప్రాయపడ్డారు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
