Kolkata, June 08: భార్యకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని భర్త ఆమె చేయిని నరికేసిన (Man ChopsOff Wifes Hand) ఘటన గుర్తుంది కదూ. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భార్య.. చేయి పోయినా తగ్గేదేలే అంటోంది. పోరాటం కొనసాగిస్తానంది. మరింత విశ్వాసంతో, పట్టుదలతో ముందుకు వెళ్తానంటోంది. కుడి చేయి లేదని నిరాశ చెందకుండా ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఎడమ చేతితో రాయడం ప్రాక్టీస్ (Writing with left Hand) చేస్తోంది. కష్టపడి చదివి పరీక్షల్లో పాసై ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకున్నానని, జాబ్ చేసి తీరతానని ఆమె తేల్చి చెప్పింది. ఆ మహిళ పట్టుదలకు, ఆత్మవిశ్వాసానికి అంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారు. వెస్ట్ బెంగాల్ లోని కేతుగ్రామ్ గ్రామానికి చెందిన రేణు ఖాతున్ (Renu Khatun) ఇటీవల ప్రభుత్వం ఆసుపత్రిలో నర్సు ఉద్యోగం సాధించింది. అయితే, ఉద్యోగం వస్తే తన భార్య తనను వదిలిపోతుందనే భయంతో భర్త షేర్ మహమ్మద్ (Sher Mohammad) దారుణానికి ఒడిగట్టాడు. ఎలాగైనా ఆమె ప్రభుత్వ ఉద్యోగంలో చేరకుండా చేయాలని నిర్ణయించుకున్న అతడు.. పదునైన ఆయుధంతో భార్య కుడి చేతిని నరికేశాడు.

Uttar Pradesh: యూపీలో దారుణం, తల్లిని తుఫాకీతో కాల్చి రెండు రోజులు శవాన్ని ఇంట్లో దాచిపెట్టిన మైనర్ బాలుడు, ఎవరికైనా చెబితే చంపేస్తానని చెల్లెలికి బెదిరింపులు, మైనర్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు   

ఈస్ట్ బుర్ద్వాన్ (East Burwan) జిల్లాలోని కేతుగ్రామ్ గ్రామానికి చెందిన షేర్ మహహ్మద్, రేణు ఖాతున్ భార్యాభర్తలు. రేణు ఖాతున్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా (Nurse) పని చేస్తోంది. ఇటీవలే పరీక్షల్లో పాసైంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం సాధించింది. అయితే, భర్త షేర్ మహమ్మద్ కు ఇది ఇష్టం లేదు. భార్యకు ప్రభుత్వ ఉద్యోగం రావడం వల్ల ఆమె తనను విడిచిపెట్టి వెళ్లిపోతుందనే భయం అతడిని పట్టుకుంది. దాంతో అతడు ప్రభుత్వ ఉద్యోగంలో చేరేందుకు అంగీకరించలేదు. జాబ్ లో చేరొద్దని ఆదేశించాడు. అయితే, భార్య మాత్రం భర్త మాట వినలేదు. జాబ్ లో జాయిన్ కావాలని డిసైడ్ అయింది. తన మాట కాదనడంతో భర్త కోపంతో రగిలిపోయాడు. ఎలాగైనా భార్య ఆ జాబ్ లో చేరకుండా చేయాలని నిర్ణయించుకున్న అతడు దారుణానికి ఒడిగట్టాడు. ఉన్మాదిలా వ్యవహరించాడు. ఓ పదునైన ఆయుధంతో భార్య చేయి నరికేశాడు(Chopsoff her Hand). దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. అంతేకాదు.. తెగిన చేయి భాగాన్ని అతడు దాచేశాడు. డాక్టర్లు తిరిగి అతికించకుండా ఈ కిరాతకానికి పాల్పడ్డాడు.

భార్య చేయి నరికిన భర్త.. రక్తమోడుతున్న భార్యను తనే స్వయంగా స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లాడు. డాక్టర్లు ఆమె చేయిని కొంతభాగం తొలగించి వైద్యం చేశారు. ఆ తర్వాత భర్త షేర్ మహమ్మద్ అక్కడి నుంచి పరార్ అయ్యాడు. ప్రభుత్వ ఉద్యోగం వల్ల తన భార్య తనను విడిచిపెట్టి పోతుందనే భయంతో ఆ భర్త చేసిన పని అందరినీ షాక్ కి గురి చేసింది. ఆ భర్తను అంతా తప్పుపడుతున్నారు. వాడసలు మనిషే కాదని తిట్టిపోస్తున్నారు. అతడి భయంలో అర్థం లేదంటున్నారు. వాడు మనిషి కాదు శాడిస్ట్ అని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Andhra Pradesh Shocker: ఆరేళ్ల బాలికపై 45 ఏళ్ళ కామాంధుడు లైంగికదాడి, బట్టలూడదీసి మర్మాంగాన్ని చితక్కొట్టిన స్థానికులు, అనంతరం పోలీసులకు అప్పగింత, కుప్పంలో ఘటన 

అయితే పట్టుదలతో గవర్నమెంట్ జాబ్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్న రేణుకు సీఎం మమతా బెనర్జీ(Mamatha Benarjee) అండగా నిలిచారు. ఆమె వైద్యానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. ఆమె గురించి కేర్ తీసుకునే బాధ్యత తనదే అని హామీ ఇచ్చారు. రేణు పట్టుదలను ఆమె మెచ్చుకున్నారు.