Agra Road Accident (Photo Credits: ANI)

New Delhi, Dec 22: దేశంలో రెండు చోట్ల ఘోర రోడ్డు ప్రమాదాలు (Road Accidents) చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో 10 మంది తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో యమునా ఎక్స్‌ప్రెస్‌ హైవేపై (Agra-Lucknow Expressway) ట్యాంకర్‌ను కారును ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు సజీవ దహనమయ్యారు.మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దుర్ఘటనలో ఐదుగురు మృత్యువాతపడగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన సియోని సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద జరిగింది.

ఆగ్రా విషాద ఘటన వివరాల్లోకి వెళితే.. యూపీ 32 కేడబ్ల్యూ 6788 కారులో ఐదుగురు ఢిల్లీ వైపు వెళ్తున్నారు. తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో ఖండౌలి పోలీస్‌స్టేషన్‌ ప్రాంతంలో, టోల్‌ప్లాజాకు నాలుగు కిలోమీటర్ల ముందు ఓ ట్యాంకర్‌ను ఓవర్‌టెక్‌ చేసేందుకు ప్రయత్నించిన సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో కారు వేగంగా ఉందని, కంట్రోల్‌ కాకపోవడం ట్యాంకర్‌ డీజిల్‌ ట్యాంకును ఢీకొట్టి ఉంటుందని పోలీసులు తెలిపారు. దీంతో మంటలు వ్యాపించాయి. కారులో ప్రయాణిస్తున్న వారంతా బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేశారు. వారు సెంట్రల్‌ లాక్‌ కావడంతో వారు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. కారు మొత్తం మంటలు వ్యాపించి ఐదుగురు కారులోనే దహనమయ్యారు.

నేటి నుంచి జనవరి 5 వరకు నైట్ కర్ఫ్యూ, కీలక నిర్ణయం తీసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం, ఇండియా నుంచి యూకేకి విమానాల సర్వీసు రద్దు, దేశంలో తాజాగా 19,556 మందికి కరోనా

ఇక ఎంపీలోని సియోని వద్ద ఆగి ఉన్న ఆయిల్‌ ట్యాంకర్‌ను కారు ( Road accident in Seoni) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులు, మృతులంతా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన వారు. వీరు కారులో యూపీ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్నారని బుండోల్‌ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ దిలీప్‌ పంచేశ్వర్‌ తెలిపారు. అయితే అతివేగమే ప్రమాదానికి కారణమని, సంఘటన జరిగిన సమయంలో కారు అతివేగంగా ప్రయాణిస్తోందని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

ప్రమాదంలో గాయపడ్డ వారు అపస్మారక స్థితిలోకి వెళ్లారని, వారిని హాస్పిటల్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. మృతి చెందిన వ్యక్తుల్లో నలుగురిని విజయ్‌ బహదూర్‌ పటేల్‌, అతని భారత సరిత, కుమారుడు అజయ్‌, మరో మహిళను రాధగా గురించామని, మిగతా వారి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ప్రమాదంలో 9, 4 ఏళ్ల బాలికలు గాయపడ్డారని, వారిని హాస్పిటల్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.