Dallas, July 18: పొట్టి వరల్డ్ కప్ విజయం తర్వాత విదేశాల్లో విహారిస్తున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) క్రికెట్ అకాడమీని ప్రారంభించాడు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న హిట్‌మ్యాన్ డల్లాస్‌లో క్రిక్‌కింగ్‌డమ్ క్రికెట్ అకాడమీ (Crickingdom Cricket Academy) ఓపెనింగ్ సెరమొనీలో పాల్గొన్నాడు. క్రిక్‌కింగ్‌డమ్ క్రికెట్ ప్రతినిధులు, అభిమానుల సమక్షంలో గురువారం రోహిత్ శర్మ (Rohit Sharma) రిబ్బన్ కత్తిరించి అకాడమీ ఓపెనింగ్ చేశాడు. క్రిక్‌కింగ్‌డమ్ గ్లోబల్ నెట్‌వర్క్ కంపెనీకి ఇప్పటికే ఆరు దేశాల్లో క్రికెట్ శిక్షణ కేంద్రాలు ఉన్నాయి.
In Pictures 📸: 600+ people at the grand launch of the CricKingdom Cricket Academy by Rohit Sharma, at Dallas 👏#TeamRo @ImRo45 pic.twitter.com/nXCjA6iIfY
— Team45Ro (@T45Ro) July 18, 2024
భారత సారథి ప్రారంభించిన ఈ అకాడమీ ఆ సంస్థకు 42వది కావడం విశేషం. బార్బడోస్ నుంచి పొట్టి ప్రపంచ కప్‌తో వచ్చిన రోహిత్ శర్మ.. ఓపెన్ టాప్ బస్సులో విక్టరీ పరేడ్‌లో పాల్గొన్నాడు. అనంతరం వాంఖడేలో బీసీసీఐ సన్మానం తర్వాత హిట్‌మ్యాన్ లండన్ వెళ్లాడు. అక్కడ వింబుల్డన్ సెమీ ఫైనల్ వీక్షించి.. అమెరికాలో వాలిపోయాడు. అక్కడ అభిమానులతో మాట పలికిన రోహిత్.. తాజాగా క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఆగస్టు 2న శ్రీలంకతో వన్డే సిరీస్ ఉన్నందున త్వరలోనే రోహిత్ స్వదేశం రానున్నాడు.