Screenshot of the video (Photo Credit: X/@gaurav1307kumar)

Sabarkantha, SEP 08: దీంతో కారు పైభాగానికి చేరుకున్న ఆ జంట.. సాయం కోసం దాదాపు రెండు గంటలపాటు బిక్కుబిక్కుమంటూ ఎదురుచూసింది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు వారిని కాపాడగలిగాయి. సాబర్‌కాంఠా జిల్లాకు చెందిన సురేశ్‌ మిస్త్రీ అనే వ్యక్తి తన భార్యతో కలిసి కారులో వెళ్తున్నారు. ఆ సమయంలో కరోల్‌ నదిలో వరద ప్రవాహం ఉంది. అయినప్పటికీ దాన్ని దాటేందుకు యత్నించారు. మధ్యలోకి వెళ్లగానే వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో ఆ ప్రవాహంలో 1.5 కి.మీ దూరం కొట్టుకుకుపోయిన ఆ కారు.. చివరకు ఓ చోట ఆగిపోయింది. వరద మరింత పెరిగి.. కారు పైభాగం మాత్రమే కనిపించే స్థాయికి చేరుకుంది. అప్పటికే మిస్త్రీ దంపతులు అతి కష్టం మీద బయటకు వచ్చి వాహనం పైభాగానికి చేరుకున్నారు.

Sabarkantha Viral Video

 

కారు పైభాగంలో కూర్చొని తమ ఫోన్‌తోనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు స్థానికులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. వరద ఉద్ధృతి కొనసాగుతుండటంతో వారిని బయటకు తీసుకురాలేకపోయారు.

Heavy Rain Alert For Telangana: తెలంగాణ‌లో ఈ జిల్లాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండండి! మూడు రోజుల పాటూ అతి భారీ నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం, ఐఎండీ అల‌ర్ట్ జారీ 

అలా దాదాపు రెండు గంటలపాటు మిస్త్రీ దంపతులు వాహనం పైభాగంలోనే కూర్చుండిపోయారు. చివరకు వరద ప్రవాహం కాస్త తగ్గడంతో రెస్క్యూ బృందాలు వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.