Sadistic Parents: శాడిస్టు తల్లిదండ్రులంటే వీళ్లే, ఇంటికి లేటుగా వచ్చాడని కఠిన శిక్ష, పిల్లాడి కాళ్లలో మొలకెత్తిన విత్తనాలు, రక్తమే ఆ విత్తనాలకు నీరు, తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
sadistic parents 8-year-old boy forced to kneel in buckwheat as punishment for so long that they had to be surgically removed (Photo-Representational image-Getty)

Moscow, December 17: రష్యాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులు వేసిన శిక్షకు పిల్లాడు అల్లాడిపోయాడు. ఆ తల్లిదండ్రులు వేసిన శిక్ష వల్ల పిల్లాడి కాళ్లలో గింజలు మొలకెత్తాయి. ఆ పిల్లాడి శరీరంలోని రక్తమే నీరుగా ఆ విత్తనాలు(Buckwheat) మొలకెత్తాయి. కథనం వివరాల్లోకెళితే.. రష్యాకు చెందిన సార్జే కాజకోవ్, అలీనా యుమషేవ భార్యాభర్తలు, వీరికి 8 ఏళ్ల పిల్లవాడు(eight-year-old boy) ఉన్నాడు. ఆ ఎనిమిదేళ్ల ఆ పిల్లాడు స్నేహితులతో ఆడుకుంటూ ఇంటికి లేట్‌గా వచ్చాడు.

దీంతో కోపం తెచ్చుకున్న అతని తండ్రి ఇంటికొచ్చిన పిల్లాడిని పనిష్మెంట్ కింద (punishment) తీవ్రంగా కొట్టాడు.కొట్టమే కాకుండా నేలపై గోధుమల జాతికి చెందిన కొన్ని గింజలు(బక్‌వీట్ విత్తనాలు) పోసి, వాటిపై పిల్లాడిని మోకాళ్లపై కూర్చోబెట్టాడు. ఇలా ఏకంగా 9గంటలు కూర్చోబెట్టాడు. దీంతో పిల్లాడి మోకాళ్లపై చర్మం తెగి రక్తం కారడంతో తడిచిన ఆ విత్తనాలు..(grain seeds) అతని కాళ్లలోనే మొలకలెత్తాయి. దీంతో ఆ పిల్లాడు కనీసం లేచి నిలబడలేకపోయాడు. కాసేపటికి తండ్రి పక్కకు వెళ్లినపుడు ఇంట్లోంచి ఎలాగోలా బయటకు పారిపోయిన ఆ పిల్లాడు పక్కింటికెళ్లి తలుపు కొట్టాడు. సాయం చేయాలని వాళ్ల కాళ్ల మీద పడ్డాడు.

పిల్లాడి కాళ్లలో మొలకెత్తిన విత్తనాలను చూసిన షాకయిన పొరుగింటివారు వెంటనే పోలీసులకు సమాచారం అందించి, పిల్లాడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. మత్తుమందిచ్చి పిల్లాడి మోకాళ్లలోని గింజలను వైద్యులు తొలగించారు. ఈ పిల్లాడి తండ్రి సార్జే కాజకోవ్(35)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిల్లాడిని ఇలా శిక్షించడానికి తల్లి అలీనా యుమషేవ కూడా అంగీకరించిందని ఆ తండ్రి చెప్పడంతో ఒక్కసారిగా పోలీసులు షాకయ్యారు.

దీనిపై ఆమెను ప్రశ్నించగా.. తను, సార్జే ఆన్‌లైన్లో వెదికి ఈ పద్ధతిని కనుగొన్నామని, ఆ గింజలపై కూర్చుంటే ఎటువంటి నొప్పి ఉండదని ఆమె పోలీసులకు చెప్పింది. అందుకే తను ఆ శిక్షకు ఒప్పుకున్నానని పోలీసుల ముందు బుకాయిస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను గృహనిర్భందం చేశారు. సార్జేను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని Dailymail ప్రచురించింది.