Salil Parekh (Photo Credits: infosys.com)

New Delhi, Aug 22: ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు చేయ‌డానికి తీసుకొచ్చిన కొత్త పోర్ట‌ల్‌(New income tax portal )లో ఎదుర‌వుతున్న అవాంత‌రాల‌ను ఇంకా ప‌రిష్క‌రించ‌ని ఇన్ఫోసిస్‌పై కేంద్ర ఆర్థిక శాఖ ( Ministry of Finance) ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ మేర‌కు వివ‌ర‌ణ కోరుతూ ఇన్ఫోసిస్ ఎండీ, సీఈవో స‌లీల్ ప‌రేఖ్‌కు ఆదివారం నోటీసులు జారీ చేసింది.

కాగా 2019లో దీని కాంట్రాక్ట్‌ను ఇన్ఫోసిస్ సొంతం చేసుకుంది. జూన్ 7న కొత్త ఇన్‌క‌మ్ ట్యాక్స్ పోర్ట‌ల్ (www.incometax.gov.in)ను ప్రారంభించారు. అయితే రెండున్న‌ర నెల‌లు గ‌డుస్తున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఇందులో ఏదో ఒక సమస్య ఎదుర‌వుతూనే ఉంది. దీనిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎంతో మంది ట్యాక్స్ పేయ‌ర్లు ఫిర్యాదు చేశారు.

వెంటనే వీటిని ప‌రిష్క‌రించాల్సిందిగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌ (Nirmala Sitharaman) ఇన్ఫోసిస్‌ను కోరారు. యూజ‌ర్ల‌కు ప‌ని సులువు చేయ‌డానికి ఈ కొత్త పోర్ట‌ల్ తీసుకొచ్చినా.. ఇందులోని అవాంత‌రాల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని ఈ సందర్భంగా ఆర్థిక శాఖ స్ప‌ష్టం చేసింది. ఇన్‌క‌మ్ ట్యాక్స్ రిట‌ర్న్స్ ఫైలింగ్స్‌ను వేగవంతం చేసి, రీఫండ్‌ల‌ను సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఇవ్వాల‌న్న ఉద్దేశంతో ఈ కొత్త పోర్ట‌ల్ తీసుకొచ్చారు.

ఈ లింక్ ఓపెన్ చేస్తే మీ బ్యాంక్ ఖాతా హ్యాక్ అయినట్లే, హెచ్చరించిన ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ సైబరాబాద్, డీమార్ట్‌ సూపర్ మార్కెట్ తన 20 వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత బహుమతులు అంటూ లింక్

Here's Income Tax India Tweet

యూజ‌ర్ల‌కు ఎదుర‌వుతున్న సాంకేతిక స‌మ‌స్య‌ల‌పై ఇన్ఫోసిస్ స్పందించింది. దీనిపై తాము ప‌ని చేస్తున్నామ‌ని, సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ప‌రిష్క‌రిస్తామ‌ని చెప్పింది. గ‌త వారం వ్య‌వ‌ధిలో కొన్ని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించిన‌ట్లు తెలిపింది. పోర్ట‌ల్‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ ల‌క్ష ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లైన‌ట్లు సంస్థ వెల్ల‌డించింది