SC Pays Tribute to 77 Lawyers: కరోనాతో 77 మంది సుప్రీంకోర్టు లాయర్లు కన్నుమూత, సంతాపం తెలిపిన జస్టిస్‌ ఎన్వీ రమణ సహా న్యాయమూర్తులు, ఇబ్బందుల్లో ఉన్న న్యాయ‌వాదుల‌కు ప్ర‌భుత్వం సాయం చేయాల‌ని కేంద్రానికి లేఖ రాసిన చీఫ్ జ‌స్టిస్
Justice NV Ramana (Photo Credits: PTI)

New Delhi, June 29: వేస‌వి సెల‌వుల త‌ర్వాత సుప్రీంకోర్టులో తిరిగి కార్య‌క‌లాపాలు మొద‌ల‌య్యాయి. సుప్రీంకోర్టు కార్యకలాపాలు ప్రారంభం కాగానే కోవిడ్‌తో మృత్యువాతపడిన 77 మంది లాయర్లకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ సహా న్యాయమూర్తుల తరఫున సంతాపం (SC Pays Tribute to 77 Lawyers of SCBA) వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ (ఎస్‌సీబీఏ)కు (Court Bar Association (SCBA) చెందిన 77 మంది కోవిడ్‌తో మృతి చెందినట్లు ఎస్‌సీబీఏ తెలిపింది.

మృతులకు మా ప్రగాఢ సంతాపం. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ 2 నిమిషాలు మౌనం పాటిస్తున్నాం’ అని జస్టిస్‌ ఎన్వీ రమణ పేర్కొన్నారు. కరోనాతో మృతి చెందిన సభ్యులను స్మరించుకోవడం ఉత్తమమైన చర్యగా న్యాయవాది గోపాల్‌ శంకర నారాయణ అభివర్ణించారు. క‌రోనాతో కోర్టులు ప‌నిచేయ‌క ఇబ్బందుల్లో ఉన్న న్యాయ‌వాదుల‌కు ప్ర‌భుత్వం సాయం చేయాల‌ని కేంద్ర న్యాయ‌శాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్‌కు చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ (Chief Justice of India N V Ramana) లేఖ రాశారు.

దేశంలో కనిష్ఠ స్థాయికి పడిపోయిన కేసులు, తాజాగా 37,566 మందికి కోవిడ్, 56,994 మంది డిశ్చార్జ్, ప్రస్తుతం దేశంలో 5,52,659 లక్షల యాక్టీవ్‌ కేసులు, ముంబైలో సగానికి పైగా పిల్లల్లో కోవిడ్‌ యాంటీబాడీలు

ఈ ప‌రిణామాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) స్వాగ‌తించింది. చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌కు బీసీఐ చైర్మ‌న్ మ‌న‌న్ కుమార్ మిశ్రా ధ‌న్య‌వాదాలు తెలిపారు. భార‌త న్యాయ‌వ్య‌వ‌స్థ‌కు సార‌ధ్యం వ‌హిస్తున్న వ్య‌క్తి.. తొలిసారి.. సుదీర్ఘ కాలం త‌ర్వాత న్యాయ‌వాదుల క‌ష్టాలు విని వారి ఇబ్బందుల ప‌రిష్కారానికి త‌గిన రీతిలో స్పందించార‌ని పేర్కొన్నారు.