Accused Sanjay Roy (Photo Credits: File Photo)

Kolkata, Jan 20: ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ ఆస్పత్రికి చెందిన జూనియర్ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని సీల్దా కోర్టు ఆర్‌జి కర్ అత్యాచారం-హత్య కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు విధించింది. దీంతో పాటు కోర్టు రూ. 50,000 జరిమానా కూడా విధించింది.బాధితురాలి కుటుంబానికి రూ.17 లక్షలు పరిహారంగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

దోషిగా తేలిన సంజయ్ రాయ్ ఈ కేసు విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తనను కావాలనే ఇరికించారని, తాను ఆ పని చేయలేదన్నారు. ఈ పని చేసిన వారిని వదిలిపెట్టారని, ఇందులో ఒక ఐపీఎస్ కూడా పాల్గొన్నారని వ్యాఖ్యానించారు. అంతేకాదు తప్పు చేసి ఉంటే తన మెడలో ధరించిన రుద్రాక్ష మాల విరిగిపోయేదన్నారు. ఈ క్రమంలో తాను ఈ నేరం చేయలేదన్నారు. తనని నేరానికి పాల్పడినట్లు ఒప్పుకోవాలని ఒత్తిడి చేసినట్లు చెప్పాడు.

ఆస్పత్రిలో రాత్రిపూట శవాలతో సెక్స్, కోల్‌కతా రేప్ హత్య కేసు నిందితుడు ఫోన్‌లో సంచలన వీడియోలు, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని తెలిపిన జూనియర్ డాక్టర్లు

గతఏడాది ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆర్జీకర్‌ ఆసుపత్రి సెమినార్‌ రూమ్‌లో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్‌ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన (Kolkata Doctor Murder Case) తీవ్ర నిరసనలకు దారితీసింది. పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును కోల్‌కతా పోలీసుల నుంచి సీబీఐ స్వీకరించి, విచారించింది. దీనిలో భాగంగా ప్రత్యేక కోర్టుకు అభియోగాలు సమర్పించింది.

ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌ పేరును మాత్రమే ఛార్జ్‌షీట్‌లో చేర్చింది. సామూహిక అత్యాచారం విషయాన్ని అభియోగ పత్రంలో ప్రస్తావించలేదు. ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్‌ను ఆగస్టు 10న కోల్‌కతా పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్‌ స్టేషన్‌ మాజీ ఆఫీసర్‌ ఇన్‌ ఛార్జి అభిజిత్‌ మండల్‌ను అరెస్టు చేసింది. సాక్ష్యాలు తారుమారుచేశారన్న ఆరోపణలపై వారు అరెస్టు కాగా.. తర్వాత వారికి ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ లభించింది. వారు అరెస్టయిన దగ్గరినుంచి 90 రోజుల్లో అనుబంధ ఛార్జ్‌షీట్‌ను ఫైల్‌ చేయకపోవడంతో ఈ బెయిల్ లభించింది.

ఇక ఈ కేసు విషయంలో రాయ్ తల్లి ఆదివారం మాట్లాడారు. తన కొడుకు దోషి అయితే, కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చినా, తగిన శిక్ష పడాలని అన్నారు. ఎందుకు? మనం అతన్ని ఉరితీయకూడదా? అని ప్రశ్నించగా.. 'ఒంటరిగా ఏడుస్తాను' కానీ. తాను శిక్షను విధిగా అంగీకరిస్తానని తెలిపారు. జనవరి 18న సీల్దా కోర్టు సంజయ్‌ను దోషిగా నిర్ధారించిన తర్వాత మొదట మీడియాతో మాట్లాడకుండా ఉన్న సంజయ్ తల్లి మాల్తి రాయ్ ఆదివారం మాట్లాడారు. ఒక మహిళగా, ముగ్గురు కుమార్తెల తల్లిగా, నేను లేడీ డాక్టర్‌కు మద్దతు ఇస్తున్నానని చెప్పారు.