Bangalore, FEB 05: ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 13 మంది మహిళలపై లైంగిక దాడికి (Rape) పాల్పడ్డాడు బెంగళూరుకు చెందిన ఒక టెకీ. ఐటీ రంగంలో (IT Employee) ఉద్యోగాలు ఉన్నాయంటూ వారికి ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ద్వారా గాలం వేశాడు. వారిని లైంగికంగా వాడుకొని, దాన్ని మొబైల్‌లో రికార్డు చేశాడు. తనతో సంబంధం కొనసాగించాలని వారిని బ్లాక్‌మెయిల్ చేయసాగాడు. ఒక బాధితురాలి ఫిర్యాదుతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో (Bangalore) ఈ సంఘటన జరిగింది. 28 ఏళ్ల దిలీప్ ప్రసాద్.. మోనికా, మేనేజర్ అన్న మహిళల పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలు కలిగి ఉన్నాడు. కరోనా సమయంలో ఐటీ రంగంలో ఉద్యోగాలు కోల్పోయిన మహిళలతో పరిచయం పెంచుకున్నాడు. వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి హోటల్‌కు రప్పించి లైంగిక దాడికి పాల్పడేవాడు. ఈ చర్యను రికార్డ్ చేసి వారిని లైంగికంగా వేధించసాగాడు.
ఇలా 13 మంది మహిళలను ఆ టెక్కీ ట్రాప్ చేశాడు. కాగా, జనవరి 26న ఒక బాధితురాలు సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు జరిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దిలీప్ ప్రసాద్ చాలాకాలంగా ఈ వ్యవహారం సాగిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఐటీ చట్టంతోపాటు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం అతడ్ని అరెస్ట్ చేశారు. ఐటీ రంగంలో నిష్ణాతుడైన నిందితుడు మంచి జీతాన్ని కూడా అందుకుంటున్నాడని పోలీసులు తెలిపారు.