Mumbai, November 12: శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ (Shiv Sena's Sanjay Raut) ఆసుపత్రిలో చేరారు. ఛాతీనొప్పి( chest pain)తో బాధపడుతున్న ఆయనకు ముంబయిలోని లీలావతి ఆసుపత్రి(Lilavati Hospital in Mumbai)లో చికిత్స అందిస్తున్నారు. కొన్నిరోజులుగా రౌత్ ఛాతీనొప్పితో బాధపడుతున్నారని, చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లగా ఒకట్రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
సంజయ్ రౌత్ అస్వస్థత పట్ల ఆందోళన చెందాల్సిన పనేమీ లేదని, నిద్ర లేకుండా గడపటం వల్ల రక్తపోటులో హెచ్చుతగ్గులు చోటు చేసుకున్నాయని డాక్టర్లు వెల్లడించినట్లు చెబుతున్నారు.
విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.ఇదివరకే ఓ సారి గుండెనొప్పి రావడంతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారని, తాజాగా మరోసారి అదే పరిస్థితి తలెత్తిందని సునీల్ రౌత్ చెప్పారు. విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు సూచించినట్లు తెలిపారు.
శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే, ఆయన కుమారుడు, వర్లీ శాసన సభ్యుడు ఆదిత్య థాక్రే వెంటనే సంజయ్ రౌత్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. అలాగే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇతర కాంగ్రెస్ నేతలు ఆయన్ని పరామర్శించారు.
సంజయ్ రౌత్ ని పరామర్శిస్తున్న బీజేపీ నేత ఆశిష్
Mumbai: BJP leader Ashish Shelar met Shiv Sena leader Sanjay Raut at Lilawati hospital today. Raut was admitted to hospital yesterday after he complained of chest pain. pic.twitter.com/H8wJSJLc6l
— ANI (@ANI) November 12, 2019
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం సంజయ్‌రౌత్ దూకుడుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పదవిని చెరిసగం పంచాల్సిందేనని ఆయన బీజేపీకి అల్టిమేటం ఇచ్చారు. శివసేన అధినాయకత్వం వ్యూహాలకు అనుగుణంగా అటు బీజేపీని ఇరకాటంలో పెడుతూ.. ఇటు ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో పొత్తుకు లైన్ క్లియర్ చేయడంలో సంజయ్ రౌత్ కీలక పాత్ర పోషించారు.