Dindigul, JAN 21: రోడ్డు మీద కుక్క కనిపిస్తే దాన్ని ఎవరైనా ఏమని పిలుస్తారు? కుక్క అనే కదా? కానీ తమిళనాడులో ఓ వ్యక్తి కుక్కను కుక్క అని పిలిచినందుకు హత్యకు (dog owner kills 62-year-old man) గురయ్యాడు. కుక్కను కుక్కా (Dog) అని పిలవొద్దు.. దానికో పేరుంది.. ఆ పేరుతోనే పిలవాలి.. లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు.. అంటూ కారాలు మిరియాలు నూరాడో వ్యక్తి. ఆ.. ఏం చేస్తావయ్యా! చూపించు చూద్దాం అనేసరికి ఆ కుక్క యజమానికి కోపం నశాలానికి అంటింది. అంతే ఆ వ్యక్తిని దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన తమిళనాడులోని (Tamil Nadu) దిండిగళ్‌లో (Dindigul) జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. తాడికొంబు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉలగంపట్టి కొట్టంకు (Ulagampatti kottam) చెందిన నిర్మలా ఫాతిమా రాణి, ఆమె కుమారులు డేనియల్, విన్సెంట్ ఒక కుక్కను పెంచుతున్నాడు. ఎవరైనా తన కుక్కను కుక్క అని పిలిచినప్పుడల్లా కోపం వ్యక్తం చేస్తుంటారు.
ఈ నేపథ్యంలో పొరుగున ఉండే 62 ఏండ్ల రాయప్పన్ ఒకరోజు కుక్క వస్తుంది కర్ర తెమ్మని మనవడు కెల్విన్‌కు చెప్పాడు. అక్కడే ఉన్న డేనియల్.. రాయప్పన్ కుక్కను కుక్కగా సంబోధించడం విన్నాడు. అతడిపై కోపం వ్యక్తం చేస్తూ ఛాతీపై బలంగా కొట్టాడు. దాంతో రాయప్పన్ కిందపడిపోయాడు. అయితే ఎంతకూ లేవకపోవడంతో స్థానికులు ఆయనను దగ్గర్లోని దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాయప్పన్ చనిపోయాడు.
Chris Hipkins: న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్ హిప్ కిన్స్ .. లేబర్ పార్టీ ప్రకటన
రాయప్పన్‌పై దాడి చేసిన ఫాతిమారాణి కొడుకులతో కలిసి పారిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా, శుక్రవారం నాడు ఫాతిమా, ఆమె ఇద్దరు కుమారులను అదుపులోకి తీసుకున్నారు. తాము ఎంతగానో ప్రేమగా పెంచుకుంటున్న కుక్కను అలా పిలవొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదని, కోపంతో దాడిచేయడంతో చనిపోతాడని అనుకోలేదని డేనియల్, విన్సెంట్ విచారం వ్యక్తం చేశారు. కుక్కను కుక్ర అన్నందుకు ఒక వ్యక్తిని చంపేశారన్న వార్త దుండిగల్‌లో చర్చనీయాంశంగా మారింది.