Siliguri court orders death sentence for rape-murder convict

West Bengal, Sep 8:  అత్యాచారం, హత్య కేసులో బెంగాల్‌లోని సిలిగురి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మైనర్​ బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఆమెను హత్య చేసిన నిందితుడి మరణ శిక్ష విధించింది. పశ్చిమ్​ బెంగాల్​లోని ఓ కోర్టు మరణ శిక్ష విధించింది. 2023 ఆగస్టు 21న పాఠశాలకు వెళ్తున్న మైనర్ బాలికను అత్యాచారం, హత్య చేశారు నిందితుడు ఎండీ అబ్బాస్. ఈ ఘటన జరిగిన ఆరు గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఈ కేసులో 33 మంది సాక్షుల వాంగ్మూలాలను సేకరించారు. ఇక నిందితుడికి మరణ శిక్ష విధించాలని గతంలో కోరాము... ఎందుకంటే నిందితుడిపై రుజువైన అన్ని సెక్షన్లలోని మూడు సెక్షన్స్​లో ఉరి శిక్ష ఉందని పీపీ బివాస్ ఛటర్జీ తెలిపారు. సెక్షన్​ 302, పోక్సో చట్టంలోని సెక్షన్​ 6 కింద మరణశిక్ష విధించారని ఛటర్జీ తెలిపారు.  సీబీఐకి బెంగాల్ డాక్టర్ అత్యాచార కేసు, సీబీఐ విచారణకు ఆదేశించిన కోల్ కతా హైకోర్టు

Here's Tweet:

కోల్​కతాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్​లో ట్రైనీ డాక్టర్​పై అత్యాచారం, హత్యపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సిలిగురి కోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. కోల్‌కతా హత్యాచార ఘటనలో సైతం నిందితుడికి కఠిన శిక్ష విధించాలని, డాక్టర్లపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి ప్రత్యేక చట్టం తెచ్చి నిందితులకు త్వరితగతిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.