Thane Lift Collapses (PIC@ ANI X)

Mumbai, SEP 10: మహారాష్ట్ర థానేలో (Thane) ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఓ భవనంలో ప్రమాదవశాత్తు లిఫ్ట్‌ కూలిపోయింది (Lift Collapses). ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘోడ్‌బందర్ రోడ్డులో ఉన్న భవనంలో ఈ ఘటన జరిగిందని థానే మున్సిపల్ కార్పొరేషన్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ విభాగం ఇన్‌చార్జి యాసిన్ తాడ్వి తెలిపారు. థానేలోని (Thane Lift Collapses) బల్కమ్ ప్రాంతంలో 40 అంతస్తుల రన్వాల్ ఎయిరిన్ భవనం లిఫ్ట్ కూలిపోవడంతో ఆరుగురు కార్మికులు దుర్మరణం చెందారు.

 

కొత్తగా నిర్మించిన భవనం పైకప్పుపై వాటర్‌ఫ్రూఫింగ్ పనులు జరుగుతున్నాయి. అయితే, పనులు ముగించుకుని కూలీలు కిందకు వస్తుండగా ఉన్న సమయంలో ఉన్నట్టుండి లిఫ్ట్‌ కూలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.