Skull Breaker Challenge After Blue whale, this new TikTok Game is so dangerous that may lead to injury (photo-Twitter)

New Delhi, Febuary 18: ఆ మధ్య బ్లూ వేల్ (Blue whale) పేరుతో వచ్చిన గేమ్ ఎంత ప్రమాదకరంగా మారిందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు దానికన్నా ప్రమాదకర గేమ్ సోషల్ మీడియాలో (Social Media) చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ లో (Tik tok) ఈ గేమ్ వైరల్ అవుతోంది. అయితే ఈ గేమ్ తీవ్రమైన ఆందోళనను రేకెత్తిస్తోంది. స్కల్‌ బ్రేకర్‌ ఛాలెంజ్‌ (Skull Breaker Challenge) పేరిట సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న ఈ గేమ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడకండని నిపుణులు చెబుతున్నారు.

ఈ గేమ్ ఏంటంటే.. ఇద్దరు వ్యక్తులు గాలిలో ఎగురుతుండగా, మూడో వ్యక్తి వారి మధ్యలో నిల్చుని అలాగే చేస్తుంటాడు. అయితే మధ్యలో వ్యక్తి పైకి ఎగురుతుండగా అతడి కాళ్లపై మిగిలిన ఇద్దరూ తన్నడం ఈ గేమ్ ప్రత్యేకత. మధ్యలో వ్యక్తి కింద పడేలా తన్నడం చూసిన చిన్నారులు, యువత ఈ ఛాలెంజ్‌ మత్తులో కూరుకుపోయారు.

Take a Look at the Skullbreaker Game

 

 

యాప్‌లో చూపిన విధంగా చిన్నారులు చేస్తుండటంతో వెన్నెముక, తలకు తీవ్ర గాయాలయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చాలామంది దీని భారీన పడ్డారు.

చిన్నారులు, యువతలో ఈ ఛాలెంజ్‌కు ఆదరణ పెరిగితే వారికి గాయాలయ్యే ప్రమాదం ఉందని తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీనేజ్‌ యువత ఎక్కువగా ఈ ట్రెండ్‌ను ఫాలోఅవడంతో ఇప్పటికే పలువురికి గాయలయ్యాయని ఎవరూ ఇలాంటి వాటి జోలికి పోరాదని సోషల్‌ మీడియా నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి పిచ్చి గేమ్స్ వెంటనే బ్యాన్ చేయాలని పలువురు పిలుపునిస్తున్నారు.