Solar Eclipse 2020: సూర్యగ్రహణం నేడే, ఉదయం 9:15 గంటల నుంచి మధ్యాహ్నం 3.04 వరకు ఆకాశంలో అద్భుతం, పలు ప్రత్యేకతలతో ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం
Representational Image (Photo Credits: Pixabay)

New Delhi, June 21: ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం (Solar Eclipse 2020) ఈ రోజు ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణం (Surya Grahan 2020) తెలంగాణలో ఉదయం 10:15 గంటల నుండి మధ్యాహ్నం 1:44 గంటల వరకు 51 శాతం గ్రహణం ఉంటుంది. ఏపీలో ఉదయం 10:21 గంటల నుండి మధ్యాహ్నం 1:49 గంటల వరకు 46 శాతం గ్రహణం ఉంటుంది. ఇక విశ్వవ్యాప్తంగా ఉదయం 9:15:58 గంటల నుంచి మధ్యాహ్నం 3.04 వరకు సూర్యగ్రహణం ఉంటుంది. పితృ దినోత్సవం ఎప్పుడు మొదలైంది? ఎన్ని దేశాల్లో అంతర్జాతీయ పితృ దినోత్సవం జరుపుకుంటున్నారు, హ్యాపీ ఫాదర్స్ డే WhatsApp Stickers, Facebook Greetings, GIF Images, SMS and Messages మీకోసం

సూర్యుని నుండి నేరుగా కిరణాలు అనేవి వస్తుంటాయి. మన దేశంలో గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకలో మొదటగా ప్రజలు సూర్య గ్రహణం వీక్షిస్తారు. కొన్ని ప్రాంతాల్లో గ్రహణం పాక్షికంగా కనపడుతుంది. ఈ ఏడాది రెండు సూర్యగ్రహణాలుండగా తొలి సూర్యగ్రహణం(Solar Eclipse 2020 June 21) ఈ రోజు ఏర్పడనుంది.

ఈ ఏడాదిలో తొలి సూర్యగ్రహణం పలు ప్రత్యేకతలను సంతరించుకుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం (Surya Grahan) కాగా.. వలయాకారంలో కనువిందు చేయనుంది. ఈ ఖగోళ పరిణామం ఫలితంగా ఆకాశంలో ‘జ్వాలా వలయం’ ఏర్పడుతుంది. జూన్ 21న ఆదివారం ఉదయం 9:15 గంటలకు గ్రహణం ప్రారంభమై, మధ్యాహ్నం 3.04 గంటలకు ముగుస్తుంది. అయితే, మధ్యాహ్నం 12.10 గంటలకు గరిష్ఠ స్థితిలో ఉంటుంది. భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళరేఖపైకి వచ్చి.. చంద్రుడి నీడ సూర్యుడిపై పడినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది అమావాస్య రోజులలోనే జరుగుతుంది. అయితే, అన్ని అమావాస్యలలోనూ గ్రహణాలు ఏర్పడవు.

సూర్యగ్రహణం అంటే..కొన్నిసార్లు భూమికి, సూర్యుడికి, మధ్య చంద్రుడు వస్తాడు. ఆ సమయంలో సూర్యుడి వెలుగును భూమిపై పడకుండా చంద్రుడు కప్పి ఉంచుతాడు. దీంతో భూమిపై చంద్రుడి నీడ పడటంతో పాటు సూర్యుడిని కప్పి ఉంచే ప్రక్రియలను సూర్యగ్రహణం(Solar Eclipse) అంటారు. చంద్రుడు సూర్యుడిని పాక్షికంగా కప్పి ఉంచినప్పుడు పాక్షిక సూర్య గ్రహణం, చంద్రుడు పూర్తిగా కప్పి ఉంచితే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది.

వలయాకార సూర్యగ్రహణంలో సూర్యుడి కేంద్ర భాగం కనిపించకుండా జాబిల్లి అడ్డుగా ఉంటుంది. దీంతో చంద్రుడి వెనుక సూర్యుడి వెలుపలి భాగం వలయాకారంలో మెరుస్తూ కనువిందు చేస్తుంది. ఆ వలయాన్ని ‘జ్వాలా వలయం’గా పిలుస్తారు. ఒక్కోసారి ఒక సెకను కంటే తక్కువ కాలంలోనే జ్వాలా వలయం మాయమవుతుంది. కొన్నిసార్లు 12 నిమిషాలకుపైగా కనిపిస్తుంది.

భూమి నుంచి చంద్రుడు అత్యంత దూరంలో ఉండే ప్రదేశాన్ని అపోజీగా పిలుస్తారు. చంద్రుడు అపోజీలో ఉన్నప్పుడు, భూమిపైకి సాధారణం కంటే కాస్త చిన్నగా కనిపిస్తాడు. ఆ తరుణంలో సూర్యగ్రహణం ఏర్పడితే, సూర్యుడిని చంద్రుడు పూర్తిగా అడ్డుకోలేని పరిస్థితి ఉంటుంది. చంద్రబింబం మూసినంత మేర మూయగా.. దాని చుట్టూ కనిపించే సూర్యబింబం మండుతున్న ఉంగరంలా కనిపిస్తుంది. దీన్నే ‘యాన్యులర్‌’ లేదా వలయాకార గ్రహణంగా పేర్కొంటారు.

‘యాన్యులర్‌’ అనే పదం ‘యాన్యులస్‌’ అనే లాటిన్ పదం నుంచి పుట్టింది. దీనికి ఉంగరం అని అర్థం. ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖండాల్లో, హిందూ, పసిఫిక్‌ మహాసముద్రాల్లోని దీవుల్లో, ఐరోపాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ గ్రహణం కనువిందు చేయనుంది. రాజస్థాన్, హర్యానా, ఉత్తరాఖండ్ కారిడార్ వెంట గరిష్టంగా 30 సెకన్ల పాటు ముత్యాల హారంగా సూర్యుడు కనిపిస్తాడు. మొత్తం గ్రహణం రాత్రిపూట దాదాపుగా చీకటిగా ఉంటుంది, అయితే మీరు సూర్యగ్రహణం విషయంలో కొంత కాంతిని గమనించవచ్చు.

టైమండ్‌డేట్ మరియు స్లోహ్ వంటి ప్రముఖ ఛానెల్‌లు దీన్ని వారి యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. మీరు నాసా ట్రాకర్ ఉపయోగించి గ్రహణం యొక్క మార్గాన్ని కూడా అనుసరించవచ్చు. గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూసేటప్పుడు కంటి రక్షణను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. సూర్యగ్రహణాన్ని నేరుగా చూడరాదని, దీని వల్ల శాశ్వతంగా అంధత్వం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అంతరిక్ష ఔత్సాహికులు ఈవెంట్‌ను ఆన్‌లైన్‌లో ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇలాంటి అరుదైన ఘటన మళ్లీ 2031లోనే భారత్‌లో ఏర్పడనుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.