Somen Mitra Dies at 78 (Photo Credits: ANI)

Kolkata, July 30: గుండెపోటుతో వెస్ట్ బెంగాల్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ( పీసీసీ) అధ్యక్షుడు సోమెన్‌ మిత్ర(78) (Somen Mitra Passes Away at 78) గురువారం మృతి చెందారు.పశ్చిమ బెంగాల్‌ కాంగ్రెస్‌ (West Bengal Congress) ఆయన మరణించినట్లు ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. సోమెన్‌ మిత్ర (West Bengal Congress president Somen Mitra) 1972-2006 వరకు ఆయన ఎమ్మెల్యేగా పని చేశారు. కిడ్ని, గుండె సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న మిత్రను కోల్‌కతా ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన జూలై 30వ తేదీ అర్ధరాత్రి 1.30 గంటలకు గుండె నొప్పితో తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. మిత్రకు కరోనా టెస్ట్‌ చేయగా నెగిటివ్‌ వచ్చినట్లు డాక్టర్లు తెలిపారు. ఎస్. ఎస్. రాజమౌళికి కరోనా పాజిటివ్, కుటుంబ సభ్యులంతా క్వారంటైన్‌లోకి, కోలుకోగానే ప్లాస్మా దానం చేస్తామని తెలిపిన దర్శక ధీరుడు

మొదటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్న మిత్ర ప్రస్తుత పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఆమె ఎదుగుదలలో ముఖ్యపాత్ర పోషించారు. ఆయన తన భార్య, కుమారుడితో కలిసి నివసిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మిత్ర మరణవార్తను ఆయన కుటుంబం అధికారికంగా ప్రకటించలేదు. సోమెన్‌ మిత్ర మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి.

Somen Mitra Dies at 78:  

2008లో అభిప్రాయభేదాలతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మిత్రా, తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. 2009లో డైమండ్ హార్బర్ నియోజక వర్గం నుంచి టీఎంసీ పార్టీ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే, 2014లో తిరిగి మళ్లీ కాంగ్రెస్ లో చేరారు.

సోమెన్ మిత్రా మృతితో కాంగ్రెస్ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. ఆయన మృతితో ఓ మంచి నాయకుడిని కోల్పోయినట్టు పార్టీ ఆవేదన వ్యక్తం చేసింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన నేతలు.. సోమెన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.