ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల ఫోన్ హ్యాకింగ్‌పై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ స్పందించారు.ఫోన్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి.. వారిని (Opposition Leaders) ఎవరో ప్రాంక్ (Pranked) చేసి ఉండొచ్చంటూ వ్యాఖ్యానించారు. ‘విపక్ష నేతలను ఎవరో ప్రాంక్ చేసి ఉండొచ్చని నేను అనుకుంటున్నా. దానిపై వారు ఫిర్యాదు చేయాలి. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’ అని అన్నారు.
'ప్రభుత్వ మద్దతున్న హ్యాకర్ల నుంచి మీ ఐఫోన్‌కు హ్యాకింగ్ ముప్పు ఉంది. మీ యాపిల్ ఐడీ ద్వారానే మీ ఫోన్‌ను టార్గెట్ చేసే అవకాశం ఉన్నదని యాపిల్ భావిస్తోంది. మీ ఫోన్లు హ్యాక్ అయితే సున్నితమైన డాటా, కమ్యూనికేషన్లను తస్కరించే ప్రమాదం ఉంది. కెమెరా, మైక్రోఫోన్లను యాక్సెస్ తీసుకొంటుంది. ఇది హెచ్చరిక నకిలీ కూడా కావొచ్చు. అయినప్పనటికీ దీన్ని సీరియస్‌గా తీసుకోండి' అని ప్రతిపక్ష ఎంపీలకు అలర్ట్ వచ్చింది.
తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా, కాంగ్రెస్ నేతలు ప్రియాంకా చతుర్వేది, శశి థరూర్, పవన్ ఖేరా, ఆప్ ఎంపీ రాఘవ చద్దా, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ .. తమ ఫోన్లు హ్యాక్ అవుతున్నట్లు తెలిపారు. ఫోన్ కంపెనీల నుంచి తమకు వార్నింగ్ మెసేజ్‌లు వచ్చినట్లు వారు పేర్కొన్నారు. పలువురు ఎంపీలు, నేతలు తమ ఫోన్లకు వచ్చిన ఈ నోటిఫికేషన్ స్క్రీన్‌షాట్లను మంగళవారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. విపక్ష పార్టీల ఎంపీల ఫోన్లను హ్యాక్ చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛ, గోప్యత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. యాపిల్ హ్యాకింగ్ అలర్ట్ సందేశాలపై దర్యాప్తు జరిపించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.