Expressway Tragedy: ఎక్స్‌ప్రెస్‌వేపై వ్యక్తిపై నుండి వరుసగా దూసుకెళ్లిన 60 వాహనాలు, ముక్కముక్కలుగా ఛిద్రమైన శరీరం, అవశేషాలను సేకరించి పోస్ట్‌మార్టం కోసం తరలించిన పోలీసులు
Expressway - Representational Image (Photo Credits: PTI)

Pune, February 20: ఎక్స్‌ప్రెస్‌వేను దాటడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని ఒక గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో (Accident) ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు, ఆపై ఆ వ్యక్తి పైనుంచి వరుసగా 60కి పైగానే వాహనాలు దూసుకెళ్లాయి, అయినా సరే ఎవరూ వాహనాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. ఈ విషాద ఘటన పుణె సమీపంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే, పుణెలోని కంషెట్ ప్రాంతానికి సమీపంలో ఉన్న బౌర్ గ్రామానికి చెందిన 47 ఏళ్ల అశోక్ మాగర్ (Ashok Magar) అనే వ్యక్తి బుధవారం రాత్రి 8 గంటల సమయంలో బిజీగా ఉండే పుణె-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేను  (Pune - Mumbai Expressway) దాటడానికి ప్రయత్నించాడు. అయితే వేగంగా దూసుకొచ్చిన ఒక కారు ఇతణ్ని ఢీకొట్టడంతో అశోక్ ఎగిరి రోడ్డుపైనే పడ్డాడు. ఇంతకంటే దారుణ విషయం ఏమిటంటే అలా రోడ్డుపై పడిపోయిన తర్వాత వెంటవెంటనే సుమారు 60కి పైగానే వాహనాలు అశోక్ శరీరం పైనుంచి దూసుకెళ్లాయి. దీంతో అతడి శరీరం ముక్కలు ముక్కలు ఛిద్రమయిపోయి, అతడి అవయవాలు రోడ్డుపై విసిరివేయబడ్డాయి. అశోక్ మృతదేహం చాలా సేపు రోడ్డుపై పడి ఉన్నా, వాహనాల ప్రవాహం అలాగే కొనసాగుతుపోయింది. ఏ ఒక్కరు కూడా వాహనాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు.

చాలా సేపటి తర్వాత ఎమర్జెన్సీ కాల్ అందుకున్న పోలీసులు, హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని కొద్ది సేపు ఎక్స్‌ప్రెస్‌వేను నిలిపివేశారు. చెల్లాచెదురుగా పడిఉన్న అశోక్ శరీరభాగాలను సేకరించి, మూటగట్టి పోస్ట్ మార్టంకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అతడి జేబులో ఉన్న ధృవీకరణ పత్రం ఆధారంగా పోలీసు ఆ వ్యక్తిని సమీప గ్రామంలో నివసించే అశోక్ మాగర్ గా గుర్తించగలిగారు.  ముంబై- నాసిక్ హైవేపై రోడ్డు ప్రమాదం,  సింగర్ గీతా మాలి మృతి

అయితే, అశోక్ ఎక్స్‌ప్రెస్‌వేపై పాదచారుల కోసం నిర్మించిన వంతెనను ఉపయోగించకుండా, నేరుగా రోడ్డు దాటడానికి ప్రయత్నం చేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఎక్స్‌ప్రెస్‌వేపై వందల సంఖ్యలో వాహనాలు దూసుకెళ్తాయి, కాబట్టి పాదచారులు రోడుపైకి వెళ్లడానికి అనుమతి లేదు. అంతేకాకుండా, ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్లే వాహనదారులు ఎవరూ కూడా తమ వాహనాలను నిలిపి ఉంచారు. అలా చేస్తే వారి వాహనాన్ని కూడా వెనకనుంచి వచ్చే వాహనాలు ఢీకొట్టి, అలా ఒకదానితో ఒకటి ఢీకొనే ప్రమాదం ఉందని పోలీసులు చెప్పారు.